
ఎంపీ రఘురామరాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. రఘురామ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదువుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.