https://oktelugu.com/

Ktr And Prashanthkishore: పీకే చెప్పిన ప్రకారమే టిక్కెట్లు..కేటీఆర్: ఆ నేతల్లో గుబులు

Ktr And Prashanthkishore: తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. ‘ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి‘ అంటూ ఆయా పార్టీల నేతలు కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష నాయకులు సైతం ముందస్తుకు సిద్ధంగా ఉండాలంటూ సంకేతాలు ఇస్తున్నారు. దీంతో తెలంగాణలో గడువు కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలన్న అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, […]

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2022 / 12:34 PM IST
    Follow us on

    Ktr And Prashanthkishore: తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. ‘ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి‘ అంటూ ఆయా పార్టీల నేతలు కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష నాయకులు సైతం ముందస్తుకు సిద్ధంగా ఉండాలంటూ సంకేతాలు ఇస్తున్నారు. దీంతో తెలంగాణలో గడువు కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలన్న అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారారు. జిల్లా పర్యటనలు చేస్తూ నేతలకు పలు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భంగా కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన ప్రకారమే టిక్కెట్లు కేటాయిస్తామని అన్నారు. దీంతో కొందరి నేతల్లో ఇప్పటి నుంచే గుబులు పుట్టుకుంది.

    రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీ తరుపున సర్వే చేస్తే ఆ పార్టీ గెలుస్తుందని నమ్మకం. అందుకే ఆయనతో సర్వే చేయించుకొని ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు కొందరు రాజకీయ నాయకులు. ఇప్పటి వరకు దేశంలోని చాలా పార్టీలు ఆయనను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఆయన సహాయంతో మరోసారి అధికారంలోకి రావడానికి వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే ప్రగతి భవన్లో కేసీఆర్ తో సమావేశమైన పీకే పార్టీ గురించి సర్వే చేయడం మొదలు పెట్టారు. ఫోన్ల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. కొందరు నేరుగా పలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై వారేమనుకుంటున్నారో గమనిస్తున్నారు.

    ప్రభుత్వంపై కొన్ని చోట్ల వ్యతిరేకత ఉందని, కొన్ని విషయాలను ప్రజలకు అనుగుణంగా చేస్తే బాగుంటుందని పీకే టీం సీఎం కేసీఆర్ కు ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై కూడా నివేదికలో పేర్కొన్నారు. ఎవరెవరు తమ నియోజకవర్గాన్ని పట్టించుకుంటున్నారు..? ఏంమేం పనులు చేస్తున్నారనే విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా సదరు ఎమ్మెల్యేకు మరోసారి టిక్కెట్లు ఇస్తే గెలిచే అవకాశం ఉందా..? అనే విషయాన్ని కూడా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంపై నమ్మకం కలిగినా నియోజకవర్గ నేత ప్రవర్తన కారణంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. అంతేకాకుండా సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటించినా అడ్డుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతో అలాంటి వారికి మరోసారి టికెట్ ఇస్తే ప్రమాదమని పీకే టీం పార్టీకి సూచింనట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఆలోచిస్తామని అన్నారు. అంతేకాకుండా పీకే టీం చెప్పిన ప్రకారమే మరో అవకాశం ఇస్తామన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంగా ఈ కామెంట్స్ చేయడంతో కొన్ని నియోజకవర్గాల్లోని నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో, పలు అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో అవి పెండింగులో పడ్డాయి. దీంతో ఇటు ప్రజల నుంచి వ్యతిరేకత.. అటు ప్రభుత్వం నుంచి నిధులు రాక సతమతమవుతున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లు తమ నియోజకవర్గాన్ని పట్టించుకోని వారు ఇప్పుడు హడావుడి చేసేవారిని ప్రజలు తరిమికొడుతున్నారు. అలాంటి వారి డేటా కూడా పార్టీ అధినేత వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికైనా కొందరు నేతలు తమ తీరును మార్చుకోవాలని, ప్రజల్లో మంచి వాడని పేరు తెచ్చుకుంటే టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువే ఉంటుందని కేటీఆర్ ఖమ్మం పర్యటన సందర్భంగా సూచించారు.