https://oktelugu.com/

Kothapalli Subbarayudu: కొత్తపల్లి సుబ్బారాయుడు సరే.. రాఘురామక్రిష్ణంరాజు మాటేమిటి?

Kothapalli Subbarayudu: ‘వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీచేస్తా. భారీ మెజార్టీతో గెలుపొందుతా. నాకు వ్యక్తిగత చరిష్మ ఉంది. ప్రజలు నన్ను ఆదరిస్తారు’.. ఇలా వ్యాఖ్యానించిన పాపానికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై వైసీపీ అధినేత జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ నుంచి సాగనంపారు. దీనికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు కారణం చూపారు. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడిపై సస్పెన్షన్ వేటు వేసినంత ఈజీగా కొంతమంది నాయకులపై వేయలేకపోతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. కొన్ని సామాజికవర్గాల […]

Written By:
  • Dharma
  • , Updated On : June 3, 2022 / 11:29 AM IST
    Follow us on

    Kothapalli Subbarayudu: ‘వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీచేస్తా. భారీ మెజార్టీతో గెలుపొందుతా. నాకు వ్యక్తిగత చరిష్మ ఉంది. ప్రజలు నన్ను ఆదరిస్తారు’.. ఇలా వ్యాఖ్యానించిన పాపానికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై వైసీపీ అధినేత జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ నుంచి సాగనంపారు. దీనికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు కారణం చూపారు. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడిపై సస్పెన్షన్ వేటు వేసినంత ఈజీగా కొంతమంది నాయకులపై వేయలేకపోతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. కొన్ని సామాజికవర్గాల నేతల విషయంలో ఒకలా.. మరికొన్ని వర్గాల విషయంలో మరోలా వ్యవహరిస్తుండడం విస్మయపరుస్తోంది. ఏ పదవి లేకపోయేసరికి సుబ్బారాయుడ్ని సాగనంపారు. అదే మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవులు దక్కని చాలా మంది ప్రజాప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అయితే హింసావాదాన్ని తెరపైకి తెచ్చారు.మేకతోటి సుచరిత సైతం అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. నెల్లూరు జిల్లాలో అయితే తాజా, మాజీలిద్దరూ రచ్చకెక్కారు. వారందర్నీ మినహాయించి కేవలం కొత్తపల్లి సుబ్బారాయుడుపైనే వేటు వేయడం ఏమిటని సాక్షాత్ అధికార పార్టీలో చర్చ నడుస్తోంది.

    Kothapalli Subbarayudu

    అధికార పార్టీలో హాట్ టాపిక్..
    కొత్తపల్లి సుబ్బారాయుడిపై వేటు వేసినంత సులువుగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వేయకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. గత రెండేళ్ల నుంచి రఘురామ కృష్ణరాజు పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగానే విమర్శిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకమైన మీడియాలో కూర్చుని వైసీపీ ప్రతినిధిగా ప్రభుత్వ వ్యవహారశైలిని, చివరకు నాయకుడి తీరును కూడా రఘురామ కృష్ణరాజు అనేక రోజులుగా విమర్శిస్తున్నారు.

    Also Read: Atmakur Bypoll- JanaSena: ఆత్మకూరులో జనసేన పోటీచేస్తుందా? మద్దతిస్తుందా?

    కానీ ఆయనపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయనపై స్పీకర్ కు అనర్హత వేటు వేయాలని కోరడం మినహాయించి రాజుగారిని పూర్తిగా బయటకు వదిలేశారు.రఘురామ కృష్ణరాజు విషయంలో తీసుకోని చర్యలు కొత్తపల్లి సుబ్బారాయుడిపై ఎందుకు తీసుకున్నట్లు? ఆయనకు ఏ పదవి లేదనేగా? రాజుపై వేటు వేస్తే ఆయన వైసీపీ ప్రతినిధిగా చెప్పుకోరు. ఇప్పటికీ తాను వైసీపీ ఎంపీగానే ఆయన చెప్పుకుని తిరుగుతున్నారు. ఇది పార్టీకి, నాయకత్వానికి ఇబ్బంది కల్గించే అంశమే. వాస్తవానికి రఘురామ కృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రెండు నెలల క్రితం చెప్పారు. డెడ్ లైన్ కూడా విధించారు. కానీ ఇంతవరకూ చేయలేదు. అది ఆయనిష్టం. కానీ వైసీపీ అధిష్టానం ఎందుకో ఆయన విషయంలో భయపడుతున్నటు్టంది.

    MP Raghu Rama Krishnam Raju

    ఇంకా ఎన్నాళ్లు..
    బీజేపీ నుంచి సానుకూలత రాకపోవడమే కారణమని చెబుతున్నా రఘురామ కృష్ణరాజును ఉపేక్షించడం పార్టీ పరంగా క్షేమం కాదు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండేళ్లలో పార్టీలోనే ఉండి పార్టీ పరంగా జగన్ ను నేరుగా విమర్శిస్తారు. పార్టీ నిర్ణయాలను ఎండగడతారు. అది జనం ఎలా రిసీవ్ చేసుకున్నారన్నది పక్కన పెడితే.. క్యాడర్, నేతల్లో మాత్రం భయం అనేది ఉండదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నుంచి వెళ్లే వారు కూడా ఎలాంటి ఫియర్ లేకుండా వెళ్లిపోతారు. అందుకే రఘురామ కృష్ణరాజు వేటు వేయడమే మంచిదని పార్టీ సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి?

    Also Read:Congress and BJP Rule: కాంగ్రెస్ , బీజేపీ పాలనకు మధ్య తేడా ఏంటి? జనం ఏమనుకుంటున్నారు?

    Recommended Videos

     

    Tags