Atmakur Bypoll- JanaSena: ఆత్మకూరు ఉప ఎన్నికలో అసలు జనసేన వ్యూహమేమిటన్నది తెలియడం లేదు. అసలు జనసేన పోటీచేస్తుందా? లేక సైడ్ అయిపోతుందా? మిత్రపక్షమైన బీజేపీకి సపోర్టు చేస్తుందా? అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ విషయంలో ఇంతవరకూ జనసేన అధి నాయకత్వంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు ఉప ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేశారు. కొంత మంది ఇండిపెండెంట్లు కూడా తమ పత్రాలు సమర్పించారు. టీడీపీ పోటీలో ఉండటం లేదని ప్రకటించింది. బీజేపీ తాము బరిలో ఉంటామని చెబుతోంది. అభ్యర్థిని ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే జనసేన మాత్రమే ఈ అంశంపై చప్పుడు చేయడం లేదు. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. బీజేపీ పోటీ చేస్తే మద్దతిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అసలు జనసేనతో మాట్లాడుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాల్సిన బీజేపీ అలాంటి మాటలే మాట్లాడకుండా… బీజేపీ అభ్యర్థి పేరుతోనే రాజకీయం చేస్తోంది. దీంతో జనసేన స్టాండ్ ఏమిటన్నది స్పష్టత లేకుండా పోయింది. తిరుపతి ఉప ఎన్నికలో చివరి వరకూ ఇదే ఊగిసలాట కొనసాగింది. దీంతో అధికార పార్టీ క్యాష్ చేసుకుంది. మరోసారి ఆ పరిస్థితి లేకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన, బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి.
ఆనవాయితీ…
సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే చనిపోతే.. వారి కుటుంబసభ్యులకే టిక్కెట్ ఇస్తే పోటీ చేయకూడదనే ఓ విధానాన్ని గతంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చి చనిపోయిన భూమానాగిరెడ్డి .. కుమార్తె పోటీ చేస్తే.. వైసీపీ పోటీ చేసింది. అదే సమయంలో తిరుపతిలో సిట్టింగ్ ఎంపీ చనిపోతే.. వైసీపీ కుటుంసభ్యులకు టిక్కెట్ ఇవ్వలేదు. అక్కడ టీడీపీ పోటీ చేసింది. బ ద్వేలు ఎమ్మెల్యే చనిపోతే కుటుంబసభ్యులకే టిక్కెట్ ఇచ్చారు.
Also Read: Congress and BJP Rule: కాంగ్రెస్ , బీజేపీ పాలనకు మధ్య తేడా ఏంటి? జనం ఏమనుకుంటున్నారు?
దాంతో టీడీపీ పోటీ చేయలేదు. జనసేన కూడా పోటీ చేయలేదు. ఇప్పుడు ఆత్మకూరులోనే జనసేన అదే విధానాన్ని అవలంభించే అవకాశం ఉంది. అయితే ఆ విషయాన్ని ఎందుకు నేరుగా చెప్పడం లేదని.. అధికారికంగా ప్రకటించాలి కదా అన్న సందేహం జనసైనికులకు కూడా వస్తోంది. బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు ప్రకటించాలా.. వద్దా అన్నది తేల్చుకోలేని అంశంగా మారిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పొత్తులు తెరపైకి రావడంతో ఎటు వెళ్లాలో జనసేన నాయకత్వానికి పాలుపోవడం లేదని తెలుస్తోంది.
క్లారిటీ ఇవ్వనున్న పవన్..
జనసేన నాయకులతో శనివారం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. అందులో ఆత్మకూరు ఉప ఎన్నిక విషయం చర్చకు వచ్చే అవకాశముందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశముందని భావిస్తున్నాయి. వీలైనంత వరకూ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పోటీ చేయకపోవచ్చని నేతలు అనుమానిస్తున్నారు. పార్టీపరంగా తీసుకున్న స్టాండ్ కావడంతో అభ్యర్థిని పెట్టకపోవడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పోటీచేసినా గెలుపొందే స్థితిలో లేకపోవడం, అధికార పార్టీకి సిట్టింగ్ స్థానం కావడం, సానుభూతి ఉండడం తదితర కారణాలతో పోటీకి దూరంగా ఉండడమే మంచిదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శనివారం నాటికి దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read:Chandrababu Naidu- KCR: చంద్రబాబు, కేసీఆర్.. ఓ సీక్రెట్ కుట్ర కోణం