CM Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీ ఎదుట సమస్యలను ఏకరువు పెట్టినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సహాయ నిరాకరణ గురించి ప్రధాని మోదీతో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.: ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీ ఎదుట సమస్యలను ఏకరువు పెట్టినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సహాయ నిరాకరణ గురించి ప్రధాని మోదీతో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్… దాదాపు 45 నిమిషాలపాటు మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రెవెన్యూలోటు కింద రూ. 32,625 కోట్లు రావల్సి ఉందని వినతిపత్రంలో తెలిపారు. అలాగే…రుణ పరిమితిలో 17,928 కోట్లు కోత విధించారని, దీనిని సరిదిద్దాలని కోరారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,467 కోట్లకు ఖరారు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు. ‘‘రాష్ట్ర విభజన జరిగిన 2014-15కు సంబంధించిన పెండింగ్ బిల్లులు, 10వ వేతన సవరణ బకాయిలు, డిస్కంల ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ ప్యాకేజీ, వృద్ధులకు పెన్షన్లు, రైతుల రుణమాఫీకి పద్దుల కింద రాష్ట్రానికి నిధులు రావాలి. అలాగే, తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.6627.86 కోట్ల విద్యుత్ బకాయిలు రావాలి’’ అని జగన్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తాగునీటి కాంపొనెంట్‌ను కూడా ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలని, మొత్తం ప్రాజెక్టువ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.905.51 కోట్లను తిరిగి చెల్లించాలని విన్నవించుకున్నారు. పీఎంగరీబ్ కల్యాణ్ యోజన కింద తక్కువ నిధులు కేటాయిస్తున్నారని, 56 లక్షల కుటుంబాల సబ్సిడీని రాష్ట్రమే భరిస్తోందని ఆయన చెప్పారు.
మెడికల్ కాజీల కోసం..
రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలి. అందువల్ల, రాష్ట్రానికి మరో 12 మెడికల్ కాలేజీలు అవసరం. విశాఖ సమీపంలోని భోగాపురం విమానాశ్రయానికి గతంలో ఇచ్చిన క్లియరెన్స్ ముగిసింది. దీనిని పునరుద్ధరించాలి. కడప స్టీల్ ప్లాంట్‌కు నిరంతరం ఇనుప ఖనిజం సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్ ప్రాజెక్టులకు 14 చోట్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అనుమతులను త్వరిత గతిన మంజూరు చేయాలి’’ అని ప్రధాన మంత్రిని కోరారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లను కూడా జగన్ కలిశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జగన్ హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు.
Also Read: Kothapalli Subbarayudu: కొత్తపల్లి సుబ్బారాయుడు సరే.. రాఘురామక్రిష్ణంరాజు మాటేమిటి?
తెలంగాణతో విద్యుత్ లొల్లి..
అంతవరకూ బాగానే ఉంది కానీ ప్రధాని మోదీతో జరిగిన చర్చలో.. మధ్యలో జగన్ తెలంగాణ ప్రస్తావన తెచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ప్రధానికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గామారుతోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను చెల్లించాల్సి ఉందని.., రాష్ట్రంలోని విద్యుత్‌పంపిణీ, ఉత్పాదక సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున.., ఈవ్యవహారాన్ని వెంటనే సెటిల్ చేయాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు. 2016–17 నుంచి 2018–19 వరకూ అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని, ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తున్నారని.., గడచిన మూడేళ్లలో రూ.17,923 కోట్ల రూపాయల మేర రుణ పరిమితిలో కోత విధించారని జగన్.. ప్రధానికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్నవి రుణాలే కాని, గ్రాంట్లు కావని.., కోవిడ్ లాంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరినట్టు తెలుస్తోంది.
Also Read:Congress and BJP Rule: కాంగ్రెస్ , బీజేపీ పాలనకు మధ్య తేడా ఏంటి? జనం ఏమనుకుంటున్నారు?