https://oktelugu.com/

Kothapalli Subbarayudu: వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్..ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లో..

Kothapalli Subbarayudu: ‘నాకు వ్యక్తిగత చరిష్మ ఉంది. అన్నివర్గాల ప్రజల ఆదరణ నాకు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ నన్ను గౌరవిస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందుతా’..నని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించిన 24 గంటల్లో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సాగనంపింది. గత కొంతకాలంగా సుబ్బారాయుడు పార్టీ తీరును ప్రశ్నించడంతో పాటు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నరసాపురం జిల్లా కేంద్రం ఏర్పాటుపై […]

Written By:
  • Dharma
  • , Updated On : June 2, 2022 6:36 pm
    Follow us on

    Kothapalli Subbarayudu: ‘నాకు వ్యక్తిగత చరిష్మ ఉంది. అన్నివర్గాల ప్రజల ఆదరణ నాకు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ నన్ను గౌరవిస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందుతా’..నని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించిన 24 గంటల్లో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సాగనంపింది. గత కొంతకాలంగా సుబ్బారాయుడు పార్టీ తీరును ప్రశ్నించడంతో పాటు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నరసాపురం జిల్లా కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పట్టారు. స్థానిక ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తగిన శాస్తి జరిగిందంటూ తన చెప్పుతో తానే కొట్టుకొని నిరసన తెలిపారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు తీరు మారుతూ వస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం పాటిస్తూ వస్తున్నారు. దీంతో సుబ్బారాయుడుపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఆయన తిరిగి తన సొంత గూటికి టీడీపీలో చేరతారన్న ప్రచారం నడిచింది. మరోవైపు జనసేన గూటికి చేరుతారని.. ఇప్పటికే ఆ పార్టీ కీలక నాయకులతో చర్చలు కూడా పూర్తయ్యాయన్న టాక్ నడిచింది. కానీ అవేవీ బయటపెట్టలేదు. తాజాగా వైసీపీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఒకటి రెండు రోజుల్లో సుబ్బారాయుడు భవిష్యత్ కార్యాచరణ వెల్లడించే అవకాశం ఉంది.

    Kothapalli Subbarayudu

    Kothapalli Subbarayudu

    అసలేం జరిగిందంటే…
    సుబ్బారాయుడు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. నరసాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘నాకు టిక్కెట్‌ కావాలని ఏ పార్టీని అడగలేదు. నాకంటూ వ్యక్తిగత ఇమేజ్‌ ఉంది. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరిస్తారు. గౌరవిస్తారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలుస్తా. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా ? ఇతర పార్టీలకు మద్దతుగా ఉంటానా ? అని ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకే క్లారిటీ ఇస్తున్నా. నరసాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటుపై ప్రజల తరపున ఉద్యమిస్తే.. నాపై ఏ 1 ముద్దాయిగా కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఎవరిని బెదిరించలేదు. గొడవలు సృష్టించ లేదు.

    Also Read: Nagababu నాగబాబు శ్రీకాకుళం పర్యటన సక్సెస్.. జనసైనికుల్లో జోష్

    శాంతియుతంగా ఉద్యమించా. నాపై ఏ కేసు పెట్టినా పట్టించుకోను. ప్రజల మధ్యనే ఉంటా.. సమస్యలపై పోరాటం చేస్తా’ అని సుబ్బారాయుడు స్పష్టం చేశారు. అయితే వైసీపీ అధిష్టానం దీనిపై సీరియస్ అయ్యింది. ఆయన ప్రకటన వచ్చి 24 గంటల్లోపే జగన్ కొత్తపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. క్రమశిక్షణ సంఘం సిఫార్సుతో జగన్ కొత్తపల్లిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

    Kothapalli Subbarayudu

    Kothapalli Subbarayudu

    జనసేన వైపు చూపు
    కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన కీలక పదవులు చేపట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. నరసాపురం టిక్కెట్ ఆశించారు. కానీ దక్కలేదు. అధిష్టానం ఆదేశాల మేరకు ముదునూరి ప్రసాదరాజు గెలుపునకు క్రుషి చేశారు. అయితే ఎన్నికల అనంతరం ప్రసాదరాజుతో సుబ్బారాయుడుకి విభేదాలు కొనసాగుతున్నాయి. స్థానికుల అభిష్టానికి వ్యతిరేకంగా నరసాపురం ప్రత్యేక జిల్లాగా ప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి గురైన సుబ్బారాయుడు జిల్లా సాధన సమితితో అడుగులు వేశారు. సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. కాపు సామాజికవర్గానికి చెందిన సుబ్బారాయుడు బలమైన నేత. ప్రస్తుతం టీడీపీలోకి వెళ్లేకంటే జనసేన బెటర్ అని ఆలోచన చేస్తున్నారు. పవన్ కు క్లీన్ ఇమేజ్ ఉండడంతో ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనలో చేరిక విషయం ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.

    Also Read:Nagababu Uttarandhra Tour: ఎన్నికలకు జనసేన రెడీ.. సమర శంఖం పూరించిన నాగబాబు

    Recommended Videos:
    వైసీపీ మంత్రులపై రెచ్చిపోయిన టీడీపీ లీడర్ || TDP Leader Sensational Comments on YCP Ministers
    చేతకాని సీఎం మన జగన్ || Public Talk on CM Jagan Government || Ongole Public Talk || Ok Telugu
    కులంతో సహజీవనం ఇప్పట్లో పోదు ? || How to Abolish Caste System || Ok Telugu

    Tags