Homeఎంటర్టైన్మెంట్Pruthvi: కమెడియన్ ‘ఫృథ్వీ’ కూతురు సినీ ఎంట్రీ.. ఆమె ఎలా ఉందో తెలుసా!?

Pruthvi: కమెడియన్ ‘ఫృథ్వీ’ కూతురు సినీ ఎంట్రీ.. ఆమె ఎలా ఉందో తెలుసా!?

Pruthvi: 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ టాలీవుడ్ లో తనదైన ముద్రవేసిన కమెడియన్ ఫృథ్వీ. సినిమాల్లో పాత్రలు చేస్తూనే రాజకీయాల్లోనూ రాణించారు. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక టీటీడీ ఛానెల్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కొనసాగుతున్నాయి. ఫృథ్వీ మాత్రమే కాదు.. ఇప్పుడు ఆయన వారసురాలు సినీ రంగ ప్రవేశం చేస్తోంది. ఫృథ్వీ కూతురు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ఇప్పటివరకూ ఆమెను, ఆమె ఫొటోలను ఫృథ్వీ బయటపెట్టలేదు. కానీ తొలిసారి విడుదల చేసే సరికి ఇంత పెద్ద కూతురు.. ఇంత అందమైన కూతురు ఫృథ్వీకి ఉందా? అని అందరూ షాక్ అవుతున్నాయి.

ఫృథ్వీ కూతురు శ్రీలు సినీ రంగ ప్రవేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మా అమ్మాయి శ్రీలు హోటల్ మేనేజ్మెంట్ చేసి మలేసియా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంది.. కానీ అమ్మాయి డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అన్ని నేర్చుకుంది. నటనపై మక్కువతో సీన్స్ చూసి అనుకరించేది. అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు. చివరికి నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పాట్నర్స్ కలిసి మా అమ్మాయి హీరోయిన్ గా సినిమాను నిర్మించారు. ఒక టీమ్ వర్క్ గా కథ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ రైటర్ ఘటికాచలం గారు ఈ సినిమాకు బాగా హెల్ప్ చేశారు. అమ్మాయి, అబ్బాయి ప్రతిభ చేశాక నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను తీశారు, పాటలన్ని అద్భుతంగా వచ్చాయి. లొకేషన్ లో మాకు సహకరిస్తున్న కమల్ గారు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పై మంచి అనుభవం కిలిగిన గౌతమ్ రెడ్డి, కెమెరామెన్ శివకుమార్ రెడ్డి ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు, అతను స్ట్రీట్ చిల్డ్రన్ ను చదివిస్తున్నాడు, చాలా గొప్ప విషయం ఇది అని ఫృథ్వీ సినిమా విశేషాలను పంచుకున్నారు.

సంగీత్ ఆదిత్య ఈ సినిమాకు మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా సాంగ్స్ విడుదల చెయ్యబోతున్నామని ఫృథ్వీ తెలిపారు.. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో. శ్రీ పిఆర్ క్రియేషన్స్ ద్వారా ఈ కొత్త రంగుల ప్రపంచం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు.

Also Read: YSR Veterinary Ambulance Services: ప్రారంభించిన పదిరోజులకే.. మూలకు చేరిన పశువైద్య సంచార వాహనాలు

ఈ సినిమాను తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న దర్శకుడికి నా కృతజ్ఞతలని ఫృథ్వీ తెలిపారు.. అతను రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమాను తీస్తున్నారు. త్వరలో ఆయన పేరు, వివరాలు మీకు తెలుపుతామని ఫృథ్వీ తెలిపారు.

Also Read: TDP- Cinema Stars: టీడీపీలో ఇమడలేకపోతున్న సినీ తారలు.. పొమ్మనలేక పొగపెడుతున్న నేతలు

Recomended Videos
ప్రెస్ మీట్ కి మేకప్ అవసరమంటావా రోజా || Minister Roja Using Security as a MakeUp Man || Ok Telugu
జగన్ ఇలాకాలో ఎమ్మార్వో రచ్చ || MRO Misbehave With Women || Pulivendula || Ok Telugu
దివ్యవాణి మాటలకు ఎమోషనల్ అయిన బాబు || Divya Vani Slams Chandrababu || Ok Telugu

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version