Konaseema Violence: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రగులుతూనే ఉంది. పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తీరుతో పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ మీద ప్రజలకు విశ్వాసం పోతోంది. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురంలో జరిగిన గొడవలో టీడీపీ నేతల హస్తం ఉందంటూ వైసీపీ విమర్శలు చేయడాన్ని టీడీపీ ఖండిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నారు. కావాలనే గొడవలు రాజేసి ఇప్పుడు వాటి నుంచి తప్పించుకోవాలని వైసీపీ చూస్తోందని టీడీపీ మండిపడుతోంది.

కోనసీమ జిల్లా అయిన అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లపై జరిగిన దాడిలో టీడీపీ నేతల హస్తం ఉందంటూ వైసీపీ మంత్రులు ఆరోపించడంతో టీడీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. ఇక్కడ 144 సెక్షన్ అమలులో ఉండగా అంతమంది ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. అదంతా ప్రణాళికలో భాగంగానే జరిగినట్లు చెబుతున్నారు. రాష్ర్టంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తీరుతో వైసీపీపై విమర్శలు పెరిగాయి. దీంతో దాని నుంచి తప్పించుకోవాలని చూసే క్రమంలో ఇలా దాడులు చేయిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తోంది.
Also Read: F3 Movie Business: ఇంతకీ ‘ఎఫ్ 3’ బిజినెస్ సంగతి ఏమిటి ?
వైసీపీ పార్టీ కార్యకర్తలే విద్వంసానికి దిగి ఇప్పుడు ఇతరులపై నేరం మోపాలని చూస్తే ఎవరు నమ్మరని చెబుతున్నారు. గతంలో కూడా వైసీపీ విధానాలు ఏంటో అందరికి తెలుస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు రిలయన్స్ హస్తం ఉందని వారి దుకాణాలు ధ్వంసం చేసింది మీరు కాదా? కోడికత్తి కేసు పెట్టి పక్కదారి పట్టించింది ఎవరో తెలియదా? మాజీ మంత్రి వివేకాను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోంది ఎవరో అందరికి అర్థమవుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఆగడాలు ప్రజలకు తెలియడంతో పార్టీ పరువు గంగలో కలుస్తోంది. దీంతో దీని నుంచి బయట పడేందుకు వైసీపీ కొత్తగా నాటకాలు ఆడుతూ విధ్వంసాలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తోంది.

ఇందులో భాగంగానే అమలాపురంలో విధ్వంసం సృష్టించి దానికి టీడీపీ కార్యకర్తలే బాధ్యులని ప్రకటనలు చేస్తున్నారు. అధికారం వారి చేతుల్లో ఉంటే ప్రతిపక్షాలు ఎలా విధ్వంసం చేస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఓ రాజకీయ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. వైసీపీ పరువు, పవరు పోయే స్థాయిలో ఉండటంతోనే కపట నాటకాలకు తెర తీస్తూ ప్రజలను బలిపశువులుగా మారుస్తోంది. దీని కోసమే అన్ని మార్గాలు అనుసరిస్తూ తప్పుదారి పట్టించాలని ప్రణాళికలు రచిస్తోంది. కానీ ప్రజలు గుడ్డిగా నమ్మరు. వారిలో చైతన్యం వస్తోంది. చంద్రబాబు సభలకు జనం బాగా రావడంతో వైసీపీలో అంతర్మథనం మొదలైంది. అదికారం కోల్పోతామనే భయంతోనే ఇవన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రణాళిక ప్రకారమే గొడవలు చేస్తూ టీడీపీని బదనాం చేయాలని చూస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంతో పార్టీ అగాధంలో పడిపోతోంది. పోయిన పరువును రాబట్టుకునేందుకు ఇంత రాద్ధాంతం అవసరమా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీకి నూకలు చెల్లాయని తెలుస్తోంది. అందుకే ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడుతోంది. భవిష్యత్ లో జగన్ తిరిగి జైలుకు వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Also Read: Kapil Sibal: కాంగ్రెస్ కు భారీషాక్.. ఉద్దండ పిండం గుడ్ బై
Recommended videos