Pooja Hegde: విదేశీయుల్లో ఇండియన్ సినిమాపై గతంలో చిన్న చూపు ఉండేది. ఆ మాటకొస్తే కొన్ని విషయాల్లో ఇప్పటికి ఉంది అనుకోండి. ముఖ్యంగా సినిమాల్లో పాటలు పెడతారని, అంతా కలిసి డాన్స్ చేస్తారని.. కథకు సంబంధం లేకుండా అవన్నీ వచ్చి పోతుంటాయనే ఇలా చాలా విషయాల్లో భారతీయ సినిమా పై ఎన్నో జోకులు ఉన్నాయి. అలా అని అవి లేకుండా సినిమా తీస్తే.. అది ఇండియన్ సినిమా అనిపించుకోదు. అయినా సినిమా అంటే.. అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అని రూల్ ఏమి లేదు కదా.

సినిమా అనేది క్రియేటివ్ వరల్డ్. ఎలా అయినా ఉండొచ్చు. సినిమా బాగుంటే.. ప్రేక్షకులు భాషతో దేశంతో కూడా సంబంధం లేకుండా ఆదరిస్తారు. మొత్తానికి దీనిపై హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది. కేన్స్ ఫెస్టివల్ కోసం పూజా హెగ్డే ఫ్రాన్స్ వెళ్లి వచ్చింది. అక్కడ విదేశీ నటీనటులను చూసింది. తనను తాను చూసుకుంది. ఇక తగ్గేదే లే అంటుంది.
Also Read: F3 Movie Business: ఇంతకీ ‘ఎఫ్ 3’ బిజినెస్ సంగతి ఏమిటి ?
ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బోలెడు ముచ్చట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ముచ్చట్ల సంగతి ఆమె మాటల్లోనే విందాం రండి. పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘విదేశీయులు కూడా ఇప్పుడు ఇండియన్ మ్యూజిక్ ను, డాన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి, మనం వాటిని తక్కువ అంచనా వేయొద్దు, వేయకూడదు కూడా’ అని చెప్పుకొచ్చింది.

పూజా ఇంకా మాట్లాడుతూ.. “సాంగ్స్, డాన్స్ మన బలం. ఈ విషయంలో మనం ఎందుకు సిగ్గు పడాలి ? మరింత మనం వాటిని ప్రోత్సహించాలి. అవసరం అయితే, సాంగ్స్ కోసం నాలాంటి హీరోయిన్లు ఏమైనా చేయాలి, ఎంతైనా కష్టపడాలి. ఒకప్పుడు విదేశీయులు సత్యజిత్ రే సినిమాల్ని ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు వాళ్లు దేవదాస్ లాంటి సినిమాల్ని కూడా ఇష్టపడుతున్నారు. అందులో మన కల్చర్, డాన్స్, మ్యూజిక్ ను లవ్ చేస్తున్నారు’ అంటూ పూజా పాప సెలవిచ్చింది.
కాన్స్ చిత్రోత్సవంలో తొలిసారి మెరిసిన పూజా హెగ్డే, మొత్తానికి ఇండియాకు తిరిగొచ్చాక, ఇండియన్ సినిమా గొప్పతనం గురించి తనదైన శైలిలో కబుర్లు చెబుతుంది. ఇక చివరగా పూజా హెగ్డే మరో మాట కూడా చెప్పింది అండోయ్. తాను కాన్స్ లో పాల్గొనడంతో కెరీర్ పరంగా తను రైట్ ట్రాక్ లోనే ఉన్న ఫీలింగ్ ఆమెకు కలిగిందట. అది మ్యాటర్.
Also Read:Poorna Remuneration: మీకు పూర్ణ కావాలా ? ఐతే రోజుకింత ఇవ్వండి ?
Recommended videos
[…] […]