F3 Movie Business: ‘ఎఫ్ 3’ బిజినెస్ ఎప్పుడో ముగిసింది. కానీ, ఏ ఏరియాని ఎంతకు కొన్నారు అనేదే బయటకు రాలేదు. ఇప్పట్లో వచ్చేలా కూడా లేదు. కాకపోతే, ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్ 3కి ఫుల్ బిజినెస్ జరిగింది. పైగా దిల్ రాజు చాలా ఏరియాలను తనే ఉంచుకున్నాడు. కాకపోతే, లెక్క కోసం ఫలానా ఏరియాకి ఫలానా రేటు అంటూ ఒక ఫిగర్ అనుకున్నారు. మరి ఆ ఫిగర్ ఏమిటో ? దాన్ని యవ్వారం ఏమిటో ? ఒక లుక్ వేద్దాం.

ఇప్పటికే నైజాంలో ఎఫ్ 3కి 30 కోట్లు ప్లస్ జి.ఎస్.టి లెక్కన క్లోజ్ చేశారని తెలుస్తోంది. ఎలాగూ ఈ సినిమాకి రెగ్యులర్ బయ్యర్లు వున్నారు. దిల్ రాజు ఎంత చెబితే అంతకు ఓకే అని, అడ్వాన్స్ లు పంపిస్తారు. అదే విధంగా అమౌంట్ లు కడతారు. తేడా వస్తే వెనక్కి ఇస్తారనే నమ్మకం ఉంది దిల్ రాజు పై. అందువల్ల పెద్దగా ముందు వెనుక ఆడరు బయ్యర్లు. అందుకే, ఇక్కడ ఈ సినిమా 30 కోట్లు పలికింది అని టాక్ నడుస్తోంది.
Also Read: Poorna Remuneration: మీకు పూర్ణ కావాలా ? ఐతే రోజుకింత ఇవ్వండి ?
ఇక ఆంధ్ర ఏరియాకు ఎఫ్ 3 ను 48 కోట్ల రేంజ్ లో కోట్ చేశారట. ఇది నిజమే అంటూ గతంలోనే వార్తలు వినిపించాయి. ఆంధ్రలో రేట్లు వచ్చిన తర్వాత వస్తున్న పెద్ద సినిమాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఈ సినిమా వేరు, మిగిలిన పెద్ద సినిమాల వ్యవహారం వేరు. కాకపోతే, ఈ చిత్రాన్ని రెగ్యులర్ సినిమాల లెక్కలో వేయడానికి లేదు. పెద్ద సినిమాలు లాగా దీనికి రేట్లు పెరగలేదు.

కానీ ఇప్పుడు రేట్లు పెంచడం లేదు కాబట్టి.. ఈ సినిమా లెక్కలు మారతాయి. అసలు అదనపు రేటు తెచ్చుకునే అవకాశం కూడా ఉండి కూడా.. దిల్ రాజు టీమ్ ఆ దిశగా వెళ్ళకపోవడం నిజంగా గ్రేటే. ఈ లెక్కన 25 కోట్లు పలికిన సీడెడ్ ఏ రేంజ్ లో కలెక్షన్స్ ను కలెక్ట్ చేస్తోందో చూడాల్సి వుంది. ఇప్పటికే బయ్యర్లు నుంచి ఎఫ్ 3 సినిమాకు గాను దిల్ రాజు కొంత అమౌంట్ ఇంకా రావాల్సి వుంది. సినిమా హిట్ ను బట్టే.. ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు తేలనున్నాయి.
Recommended videos
[…] Also Read: F3 Movie Business: ఇంతకీ ‘ఎఫ్ 3’ బిజినెస్ సంగతి ఏమ… […]
[…] Also Read: F3 Movie Business: ఇంతకీ ‘ఎఫ్ 3’ బిజినెస్ సంగతి ఏమ… […]
[…] Also Read: F3 Movie Business: ఇంతకీ ‘ఎఫ్ 3’ బిజినెస్ సంగతి ఏమ… […]