https://oktelugu.com/

కోమటిరెడ్డికి పీసీసీ అందుకే దక్కలేదా?

పీసీసీ పీఠం రేవంత్ రెడ్డి వశం అయిపోయింది. దీంతో రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తమ భవిష్యత్తు అని భావించినా చివరికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. నమ్ముకున్నవారిని నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వారికి పీసీసీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పైగా ఆయనపై సీనియర్లందరు విమర్శలు చేస్తున్నాపట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గత కొన్ని రోజులుగా తనకు పీసీసీ ఇవ్వాలని కోమటిరెడ్డి […]

Written By: , Updated On : June 28, 2021 / 08:30 PM IST
Follow us on

పీసీసీ పీఠం రేవంత్ రెడ్డి వశం అయిపోయింది. దీంతో రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తమ భవిష్యత్తు అని భావించినా చివరికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. నమ్ముకున్నవారిని నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వారికి పీసీసీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పైగా ఆయనపై సీనియర్లందరు విమర్శలు చేస్తున్నాపట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

గత కొన్ని రోజులుగా తనకు పీసీసీ ఇవ్వాలని కోమటిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. గత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సైతం విమర్శలు చేసిన వెంకటరెడ్డికి పీసీసీ పీఠం నిరాశే మిగిల్చింది. చివరి నిమిషం వరకు ఆశలు పెట్టుకున్నా అది ఫలించకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు.

కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి పేరును ఎందుకు పక్కన పెట్టింది? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. దీంతో అధిష్టానం పార్టీని ఎలా గాడిన పెడతావని ప్రశ్నించగా తడబడిపోయారు. అలాగే యువతను ఎలా సమీకరిస్తారు అనే ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేకపోవడంతోనే రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ వైసీపీతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిలదీసినట్లు తెలిసింది. దీంతో యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఈమూడు విషయాల్లో కోమటిరెడ్డి అధిష్టానం వద్ద విఫలం కావడంతో పీసీసీ పీఠం జారిపోయినట్లు చెబుతున్నారు.