Komatireddy Venkat Reddy: ‘కోమటిరెడ్డి’ కొత్త పార్టీ కథ!

Komatireddy Venkat Reddy: ‘కోమటిరెడ్డి’.. రాజకీయాల్లో తెలంగాణకు సుపరిచితమైన ఇంటిపేరు. ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాదులు వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి బ్రదర్స్‌. గతేడాది రాజగోపాల్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని విభేదించి పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్‌ చేసి బీజేపీలో చేరారు. మునుగోడుకు జరిగిన ఉప ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక వెంకటరెడ్డి కూడా టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే అధిష్టానం రేవంత్‌కే ఇవ్వడంతో […]

Written By: Raj Shekar, Updated On : April 7, 2023 10:41 am
Follow us on

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: ‘కోమటిరెడ్డి’.. రాజకీయాల్లో తెలంగాణకు సుపరిచితమైన ఇంటిపేరు. ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాదులు వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి బ్రదర్స్‌. గతేడాది రాజగోపాల్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని విభేదించి పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్‌ చేసి బీజేపీలో చేరారు. మునుగోడుకు జరిగిన ఉప ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక వెంకటరెడ్డి కూడా టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే అధిష్టానం రేవంత్‌కే ఇవ్వడంతో అప్పటి నుంచి పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయలేదు. మరోవైపు తన తమ్ముడికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా చేసిన తప్పులతో ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్‌ను వీడతున్నారని..
తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి ఉన్న ఎమ్మెల్యే పదవిని ఊడగొట్టుకోగా.. అన్న కాంగ్రెస్‌ పార్టీలో ఉండి.. చివరికి అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా వారు చేసుకున్న స్వయంకృతాపరాథమే. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పేశారని.. కొత్త పార్టీ పెడుతున్నారని గురువారం ఉదయమే ఓ పుకారు లేచింది. దీన్ని మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రచారం ఎలా జరిగిందో కోమటిరెడ్డికి మాత్రమే తెలుసు. కానీ కాసేపటికి ఆయన నుంచి ఖండన ప్రకటన వచ్చింది. తనది కాంగ్రెస్‌ రక్తమని.. పార్టీ మార్పు వార్తలను ఖండించారు.

మొదటి నుంచీ ఆరోపణలు..
భువనగిరి పార్లమెంట్‌ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మొదటి నుంచి ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారినప్పుడు కూడా ఈయన బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం నడిచింది. అయితే అదంతా బోగస్‌ అని అప్పట్లో వివరణ ఇచ్చారు వెంకట్‌రెడ్డి. మళ్లీ ఇన్ని రోజులు తర్వాత మళ్లీ పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి పార్టీ పెడుతున్నట్టు ప్రత్యర్థులు, గిట్టని వారు చేస్తున్న ప్రచారంగా కోమటిరెడ్డి వివరణ ఇస్తున్నారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. మీడియా సంస్థలు ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయొద్దని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అధికారికంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెబుతానన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానంటూ కూడా ప్రచారం చేస్తున్నారని ఇది కూడా తప్పని కొట్టిపారేశారు.

Komatireddy Venkat Reddy

కాంగ్రెస్‌ రక్తమని సెంటిమెంట్‌..
ఇక ప్రస్తుతానికి తన ముందు ఎలాంటి ఆప్షన్స్‌ లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తనది కాంగ్రెస్‌ రక్తమని సెంటిమెంట్‌ డైలాగే చెప్పారు. బీజేపీ నుంచి తనకు ఎలాంటి ఆఫర్లు లేవన్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని, కాంగ్రెస్‌ వాదిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే.. కోమటిరెడ్డి పరిస్థితిని చూసి ఆయన ప్రత్యర్థులే ఈ ప్రచారం చేయిస్తున్నారని దీంతో వివరణ ఇచ్చుకోలేక.. మరో వైపు తన నిజాయితీని నిరూపించుకోలేక ఆయన తంటాలు పడుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.