Padma Shri Darshanam Mogilaiah: గంజాయి వనంలో తులసి మొక్క ఉంటే… అది తులసి మొక్కకు చేటు తెస్తుంది. ఎందుకంటే తులసి మొక్కను కూడా గంజాయి మొక్క అని అనుకుంటారు.. సద్గుణాలు ఉన్నప్పటికీ గంజాయి వనంలోనే తులసి మొక్కను చేర్చుతారు. మనుషులకు కూడా ఇది వర్తిస్తుంది.
మంచి లక్షణాలు ఉన్న మనుషులు.. సమాజంలో చెడు వ్యక్తుల మధ్య గనుక ఉంటే అనివార్యంగా వారిని కూడా చెడు వ్యక్తులుగానే పరిగణిస్తారు. అటువంటివారిని చెడు వ్యక్తులుగానే ఈ సమాజం భావిస్తూ ఉంటుంది.. అందువల్లే మంచి వ్యక్తులు సాధ్యమైనంతవరకు చెడు వ్యక్తులకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే.. ఈ కథనానికి బలమైన ఇంపాక్ట్ ఉండాలంటే కచ్చితంగా ఈ స్థాయి ఉపోద్ఘాతం అవసరం.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలో విలక్షణమైన వ్యక్తులకు జాతీయ స్థాయి పురస్కారాలు ఇస్తోంది. అందులో తెలంగాణ నుంచి కూడా చాలామంది జాతీయస్థాయిలో పురస్కారాలు అందుకున్నారు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కిన్నెర కళాకారుడు మొగిలయ్య కూడా ఉన్నారు. మొగులయ్య కిన్నెరను అద్భుతంగా వాయిస్తారు. అందువల్లే కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటి స్థలాన్ని, నగదు బహుమతిని కూడా అందించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పద్మశ్రీ మొగిలయ్య ఇటీవల బయటికి వచ్చారు. ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఉన్న తన పోస్టర్ ను చింపేశారు. ఇది మొగిలయ్య పద్మశ్రీ సాధించిన నేపథ్యంలో ఆయన అభిమానులు రూపొందించిన చిత్రం. దానిపై ఎవరు పోస్టర్లు అంటించడంతో ఆయనలో ఆగ్రహం కలిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలను ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. అంతేకాదు ఆవేదనతో కొన్ని మాటలు కూడా ఆయన పోస్ట్ చేశారు..
మొగులయ్య పోస్టర్ అంటించినచోట కొంతమంది వ్యక్తుల పోస్టర్లు కూడా ఉన్నాయి. అయితే వారంతా రాజకీయ నాయకులు కావడం విశేషం. వాస్తవానికి మొగిలయ్య స్వచ్ఛమైన తెలంగాణ వాది. మరుగున పడిపోతున్న కళను బతికించిన వ్యక్తి. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ.. దానికోసం కొద్ది రోజులపాటు పోరాటం కూడా చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.. అయితే ఇప్పుడు ఈ కుళ్ళు సమాజాన్ని చూడలేక.. కొంతమంది ఇతర ప్రాంత వ్యక్తులకు తెలంగాణ రాష్ట్రంలో ఏకపక్షంగా దక్కుతున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేక మొగులయ్య ఇలా పోస్టర్లను చింపేశారని తెలుస్తోంది.. ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి.. అది కూడా పద్మశ్రీ పురస్కార గ్రహీత ఇలా చేయడం తెలంగాణకు ఏమాత్రం మంచిది కాదని ఉద్యమకారులు అంటున్నారు.
పద్మశ్రీ పొందిన ముఖం కూడా మనలో కొందరికి
ఖాళీ గోడలా కనిపిస్తే, ఇది అవమానం కాదు.
మన cultural consciousness ఎక్కడో బలహీనపడుతోందని చెప్పే నిశ్శబ్ద సంకేతం.
మొగిలయ్య గారు తన బొమ్మపై అంటించిన పోస్టర్లను తానే తొలగించుకుంటున్న ఆ సందర్భం
చాలా విచారకరం. నిజానికి ఇది ఎవరి మీద ఆరోపణ కాదు.… pic.twitter.com/eCnJ8Jz9xb— v e n u u d u g u l a (@venuudugulafilm) December 17, 2025