https://oktelugu.com/

Komatireddy Revanth: రేవంత్ కు కోమటిరెడ్డి చెక్

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రెండు అడుగులు ముందుకు ఒక అడుగు వెనక్కి అన్న చందంగా మారింది. ఇటీవల ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభ నిర్వహించిన పార్టీ తదుపరి సభను ఇబ్రహీంపట్నం లో నిర్వహించాలని భావించినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆక్షేపించడంతో మనసు మార్చుకున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నంలో ఈనెల 18వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నా కోమటిరెడ్డి నిర్వాకంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 14, 2021 / 11:47 AM IST
    Follow us on

    తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రెండు అడుగులు ముందుకు ఒక అడుగు వెనక్కి అన్న చందంగా మారింది. ఇటీవల ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభ నిర్వహించిన పార్టీ తదుపరి సభను ఇబ్రహీంపట్నం లో నిర్వహించాలని భావించినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆక్షేపించడంతో మనసు మార్చుకున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు చెబుతున్నారు.

    ఇబ్రహీంపట్నంలో ఈనెల 18వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నా కోమటిరెడ్డి నిర్వాకంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో సభ నిర్వహణపై నిర్ణయం తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. పైగా ఆ రోజు తాను స్థానికంగా ఉండడం లేదని చెప్పడంతో గత్యంతరం లేక సభను వాయిదా వేశారు. దీంతో విషయం పార్టీ అధిష్టానం వరకు వెళ్లడంతో నానా రభస జరుగుతోంది.

    దీంతో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోమటిరెడ్డికి ఫోన్ చేసి చీవాట్లు పెట్టినా లాభం లేకుండా పోయింది. దీంతో కోమటిరెడ్డి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడడంతో ఆయన ఆంతర్యాన్ని గ్రహించిన రేవంత్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాకుండా మరో నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇంకా మార్పు రాలేదని తెలుస్తోంది.

    గతంలో తాను పాదయాత్ర చేసి ముగింపు సభ నిర్వహించిన రావిర్యాలలో దళిత గిరిజన దండోరా నిర్వహించాలని భావిస్తున్నారు. కోమటిరెడ్డి నిరాకరణతో ఇబ్రహీంపట్నంలో సభ నిర్వహించే అవకాశం లేకపోవడంతో నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టుకు వెళ్లినా పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన రేవంత్ మరో మార్గాన్ని అన్వేషించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగా లేనట్లు సమాచారం.

    ఇబ్రహీంపట్నంలో సభ నిర్వహిస్తే కోమటిరెడ్డి రాకపోతే సమస్యలు వస్తాయని రేవంత్ గ్రహించారు. దీంత సభ నిర్వహణ సరైంది కాదని ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ లో ఇప్పటికి కూడా కొందరు నేతలు కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీకి వ్యతిరేకంగా ఉండకపోయినా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోనున్నారని సమాచారం.