రాజగోపాల్‌ యూటర్న్‌..: ఎన్నికలకు ఆరు నెలల ముందే ఆలోచిస్తాడట

కొందరు రాజకీయ నేతలు అప్పుడప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాదు. ఒక్కో సంచలన విషయాలను వెల్లడిస్తుంటారు. ఒక్కోసారి పార్టీలోని సీక్రెట్స్‌ను ముందే వదులుతుంటారు. ఆ తర్వాత అయ్యో తాను ఇలా మాట్లాడానా అని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాను అలా మాట్లాడలేదని.. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ చెప్పుకొస్తుంటారు. Also Read: ఏపీలో ఆలయాల యాత్ర..: చినజీయర్‌‌ పిలుపు ఎవరైనా ఒక మాట మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. అందులోనూ రాజకీయాల్లో ఉన్న […]

Written By: Srinivas, Updated On : January 5, 2021 3:28 pm
Follow us on


కొందరు రాజకీయ నేతలు అప్పుడప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాదు. ఒక్కో సంచలన విషయాలను వెల్లడిస్తుంటారు. ఒక్కోసారి పార్టీలోని సీక్రెట్స్‌ను ముందే వదులుతుంటారు. ఆ తర్వాత అయ్యో తాను ఇలా మాట్లాడానా అని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాను అలా మాట్లాడలేదని.. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ చెప్పుకొస్తుంటారు.

Also Read: ఏపీలో ఆలయాల యాత్ర..: చినజీయర్‌‌ పిలుపు

ఎవరైనా ఒక మాట మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. అందులోనూ రాజకీయాల్లో ఉన్న వారు ఇంకా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. తొందరపాటు అస్సలు పనికిరాదు. అందుకే.. ఓ సామెత కూడా ఉంది. ‘కాలు జారితే తీసుకోగలం కానీ.. నోరు జారితే తీసుకోలేం’ అనేసి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పని ఇలాగే ఉంది. బీజేపీ నాయకులు ఈయన మీద ఆశలు పెట్టుకుంటే ఈయనేమో భయపడిపోయి తుస్సుమనిపించాడు.

కొత్త ఏడాది మొదటిరోజే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ తిరుపతి వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, తాను ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని బాంబు పేల్చాడు. కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనుకున్నాడు. రాజగోపాల్ రెడ్డి ప్రకటనతో బీజేపీ నాయకులు హ్యాపీగా ఫీలయ్యారు. బీజేపీలోకి వెళతానని చెప్పిన రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు భయం పట్టుకుంది.

Also Read: ఇండియాకు అమెరికా మరో వార్నింగ్‌.. ఆ డీల్‌ ఆపాలంట

కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకుంటే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. అదే జరిగితే పదవి ఊడుతుంది. ఉప ఎన్నిక ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో కనుక గెలవకపోతే పదవి లేకుండా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఉప ఎన్నిక తెచ్చుకునే సాహసం చేయనంటున్నాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తానని చెబుతున్నాడు. అంటే పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటే బీజేపీలోకి వెళ్లడు అనేది ఆయన మాటలను బట్టి చూస్తే ఎవరికైనా బోధపడక తప్పదు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్