ఇక నుంచి దేశంలో ఉద్యోగాల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లలో మార్పులు తీసుకురాబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ)ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఓ ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి వర్గం ఆమోదంతో సీఈటీ నిర్వహించడానికి నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Also Read: నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో 1809 ఉద్యోగాలు..?
ఇంకా ఆయన చెప్పారంటే.. ‘యువతను, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడానికి, ఎంపికైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి.. ఈ సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహించడం జరుగుతుంది’ అని తెలిపారు. ఈ పరీక్ష బహుశా సెప్టెంబర్ నెలలో లేదా, 2021 చివరలో ఉండొచ్చని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత జోక్యం, యువత పట్ల ఆయనకున్న లోతైన శ్రద్ధ వల్ల ఈ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో 200 ఉద్యోగాలు..?
ఈ ఎన్ఆర్ఏ.. గ్రూప్ బి, సి (నాన్-టెక్నికల్) పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడంతోపాటు ఎంపికైన అభ్యర్థుల వివరాలను షార్ట్‌లిస్ట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్ఆర్ఏ ఏర్పాటులో భాగంగా దేశంలో ప్రతీ జిల్లాలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సుదూర ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
ప్రతిభ కలిగిన ప్రతీ అభ్యర్థికి అవకాశం కల్పించడమే ఈ చారిత్రాత్మక సంస్కరణ యొక్క ముఖ్యం ఉద్దేశం అని పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో మహిళలు, దివ్యాంగ అభ్యర్థులు పరీక్షలు రాయడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా వారు చాలా ఇబ్బంది పడేవారు. కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ విధానంతో మహిళలు, దివ్యాంగులు, ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు చేరువ అవుతాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ద్వారా నియామకాలకు సంబంధించి ఎన్ఆర్ఏ ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తుందని, అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది ఒక స్వతంత్ర, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని సింగ్ స్పష్టం చేశారు.