జగన్‌ నివాసానికి కొడాలి నాని..: అందుకేనా..?

కృష్ణా జిల్లాలో ఆ మంత్రి నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. నోటి మాటలతోనే ఇన్నాళ్లు బతికేస్తూ వచ్చాడు. అయితే.. ఒక్కసారిగా ఆ మంత్రికి సీఎం జగన్‌ నుంచి పిలుపువచ్చింది. అంతే హుటాహుటిన జగన్‌ దగ్గర వాలిపోయారు. కొడాలి నాని.. ఇవాళ గుడివాడలో ఉదయం కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని ఉన్నపళంగా సీఎం నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పెద్ద చర్చే జరుగుతోంది. కాగా.. గత రాత్రి గుడివాడ నియోజకవర్గంలోని తమ్మిరిస గ్రామంలో పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు, […]

Written By: Srinivas, Updated On : January 4, 2021 4:05 pm
Follow us on


కృష్ణా జిల్లాలో ఆ మంత్రి నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. నోటి మాటలతోనే ఇన్నాళ్లు బతికేస్తూ వచ్చాడు. అయితే.. ఒక్కసారిగా ఆ మంత్రికి సీఎం జగన్‌ నుంచి పిలుపువచ్చింది. అంతే హుటాహుటిన జగన్‌ దగ్గర వాలిపోయారు. కొడాలి నాని.. ఇవాళ గుడివాడలో ఉదయం కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని ఉన్నపళంగా సీఎం నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పెద్ద చర్చే జరుగుతోంది. కాగా.. గత రాత్రి గుడివాడ నియోజకవర్గంలోని తమ్మిరిస గ్రామంలో పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు, భారీగా వాహనాలు, నగదు సీజ్ చేశారు.

Also Read: ఏపీలో మత రాజకీయాలు..: ప్రతిపక్షాలకు మసాలా దొరికేసిందంట..

అయితే.. అధికార పార్టీ నేతలే పేకాట క్లబ్‌ను నడుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ ఓ కీలక మంత్రి కనుసన్నల్లో.. కృష్ణా జిల్లాలో నడుపుతున్న పేకాట డెన్‌ గుట్టు రట్టయింది. ఆదివారం రాత్రి ఎస్‌ఈబీ జరిపిన దాడుల్లో 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుంది. 28 కార్లు, కోట్ల కొద్దీ నగదు స్వాధీనం చేసుకోవడం రాష్ట్రమంతటా సంచలనం రేపింది. ఒక్కరోజు టర్నోవర్‌ 20 కోట్లపైనేనని.. ప్రవేశ ఫీజే 10 వేలు అని సమాచారం.

Also Read: సుప్రీం కోర్టులో జగన్‌ అఫిడవిట్‌ దాఖలు

కాగా.. ఇటీవలే గుడివాడలోనే భారీ బహిరంగ సభలో పేకాట క్లబ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ‘మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగలిగితే లేనిది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి?’ అని ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలతో పవన్ ధ్వజమెత్తారు. పవన్ ఆరోపణలు ఏపీ మొత్తంగా సంచలనం రేకెత్తించాయి. అయితే పవన్ ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఇలా పేకాట క్లబ్‌ దాడులు జరిగాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మరోవైపు.. తిరుమల డిక్లరేషన్ వ్యవహారం తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్న మంత్రి కొడాలి నాని ఇటీవల మళ్లీ తన నోటికి పని చెప్పారు. కొద్దిరోజులుగా ఏపీలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై స్పందించి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత తన నియోజకవర్గానికి వచ్చి విమర్శించిన పవన్ కల్యాణ్‌కు సైతం స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపించారు. తాజాగా.. సీఎం జగన్‌ నుంచి పిలుపురావడంతో తర్వాత రాజకీయాలు ఎలా మారబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.