ఏపీలో మత రాజకీయాలు..: ప్రతిపక్షాలకు మసాలా దొరికేసిందంట..

మరికొద్ది రోజుల్లో ఏపీలో తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. దీంతో ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ఓవర్‌‌ చేస్తున్నాయి. తిరుపతి టెంపుల్‌ సిటీ. అయినంత మాత్రానా హిందూ ఓట్లే కీలకం అంటే అదీ కాదు. కానీ జనసేన, బీజేపీలు మాత్రం అదే దుస్సాహసం చేస్తున్నాయి. ఇంకా ఉప ఎన్నిక నగారా మోగనే లేదు.. అప్పుడే మతం రంగును పులుముతున్నారు. Also Read: జగన్‌ నివాసానికి కొడాలి నాని..: అందుకేనా..? బీజేపీ దేశమంతా మత రాజకీయాలు చేస్తోంది. […]

Written By: Srinivas, Updated On : January 4, 2021 4:16 pm
Follow us on


మరికొద్ది రోజుల్లో ఏపీలో తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. దీంతో ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ఓవర్‌‌ చేస్తున్నాయి. తిరుపతి టెంపుల్‌ సిటీ. అయినంత మాత్రానా హిందూ ఓట్లే కీలకం అంటే అదీ కాదు. కానీ జనసేన, బీజేపీలు మాత్రం అదే దుస్సాహసం చేస్తున్నాయి. ఇంకా ఉప ఎన్నిక నగారా మోగనే లేదు.. అప్పుడే మతం రంగును పులుముతున్నారు.

Also Read: జగన్‌ నివాసానికి కొడాలి నాని..: అందుకేనా..?

బీజేపీ దేశమంతా మత రాజకీయాలు చేస్తోంది. అంతెందుకు తెలంగాణ రాష్ట్రంలోనూ అదే వర్కవుట్‌ చేసింది. కానీ.. ఏపీలో మాత్రం బీజేపీ ఆ సాహసాన్ని ఇప్పటివరకూ చేయలేదు. కానీ.. ఎందుకో ఈ దఫా ఆ కార్డును అమలు చేయాలని చూస్తోంది. ఈ దఫా పక్కాగా మతాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు అడిగేందుకు సిద్ధపడింది. జనసేనని కూడా పూర్తిగా తన ట్రాక్‌లోకి తెచ్చేసుకుని, పవన్ కల్యాణ్ మేకప్‌లో కాషాయం రంగు కలిపేసింది. అందుకే.. రెండు పార్టీలు కలిసి హిందూ ఆలయాలు, హిందూ ఆలయాల ఆస్తులు అంటూ రెచ్చిపోవడం మొదలు పెట్టాయి. మరోవైపు.. రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసమవుతున్న ఘటనలు వీరికి వరంలా మారాయి. దీంతో చెదురుమదురు సంఘటనలన్నిటినీ ఒకేచోట చేర్చి, హిందూ మతంపై దాడి అంటూ ప్రభుత్వంపై రాళ్లేయడం మొదలు పెట్టారు.

Also Read: సుప్రీం కోర్టులో జగన్‌ అఫిడవిట్‌ దాఖలు

ఎంతలా అంటే.. సీఎం జగన్ మతాన్ని తెరపైకి తెచ్చి ఆయనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ శకుని చంద్రబాబు ఆలోచనలు కూడా తోడవడంతో విగ్రహాల ధ్వంసం అనే సంఘటన కరోనా కంటే పెద్ద రాష్ట్ర విపత్తుగా మారింది. ఈ వ్యవహారాన్ని రేపు తిరుపతి ఉప ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నాయి. ఇక.. హిందూ మతాన్ని రక్షించేవారు కావాలో, విగ్రహాలను పగలగొడుతున్నా పట్టించుకోని వారు కావాలో తేల్చుకోండి అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఇక.. సీనియర్‌‌ పొలిటీషియన్‌ అయిన చంద్రబాబు కూడా చివరకు మతాన్ని భుజానికెత్తుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేలెత్తి చూపే ధైర్యం లేకపోవడం, ఒకవేళ పథకాలపై విమర్శలు చేసినా అది జగన్‌కే ప్లస్‌ అవుతుందని చంద్రబాబు భావన. అందుకే.. ఆయన కూడా మత రాజకీయాల వైపు మళ్లినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ తిరుపతి బైపోల్‌కు మాత్రం ప్రతిపక్షాలకు ఓ పాయింట్‌ దొరికినట్లుగా సంబురపడుతున్నాయి.