https://oktelugu.com/

Kodali Nani About Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం మాత్రమే.. ఏమీ లేదని నాని కీలక వ్యాఖ్యలు

Kodali Nani About Jr.NTR: టీడీపీ అధినేత చంద్రబాబు శాసనసభలో కంట నీరు పెట్టుకోవడంతో జరిగిన దుమారంలో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. నందమూరి కుటుంబం అంటే అందరికి గౌరవమేనని చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు కావాలనే వాళ్ల కుటుంబాన్ని బయటకు తెస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అవరాల కోసమే బాబు ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి వారు మోసపోతున్నారు. అందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. రాజకీయాధికారం కోసం […]

Written By:
  • Srinivas
  • , Updated On : November 25, 2021 / 05:08 PM IST
    Follow us on

    Kodali Nani About Jr.NTR: టీడీపీ అధినేత చంద్రబాబు శాసనసభలో కంట నీరు పెట్టుకోవడంతో జరిగిన దుమారంలో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. నందమూరి కుటుంబం అంటే అందరికి గౌరవమేనని చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు కావాలనే వాళ్ల కుటుంబాన్ని బయటకు తెస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అవరాల కోసమే బాబు ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి వారు మోసపోతున్నారు. అందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది.

    kodali Nani and Jr.NTR

    రాజకీయాధికారం కోసం చంద్రబాబు తన పంథా మార్చుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. తన భార్య పేరును వివాదాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఆడుతున్న నాటకాలు బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెబుతున్నారు.

    Also Read: ముద్రగడ తీరు పవన్, చంద్రబాబుకు వ్యతిరేకంగానేనా..?

    జూనియర్ ఎన్టీఆర్ తమను కంట్రోల్ చేస్తున్నారని విమర్శలు రావడంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ తో తాము ఎందుకు ఉంటామని పేర్కొన్నారు. తాము జగన్ కోసం పని చేస్తున్నాం. జగన్ ఏది చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    కొడాలి నాని, వంశీ జూనియర్ ఎన్టీఆర్ తో గతంలో సినిమాలు చేసినా ప్రస్తుతం వారిలో సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య వీరి ముగ్గురు కలిసి మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు చేసిన విషయం విధితమే. కానీ అదేమీ లేదని వారు ఖండిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటుడే కానీ మాతో క్లోజ్ గా ఉండటం లేదని తేల్చారు.

    Also Read: స్టార్ హీరోలకు జగన్ ఓ గండంగా మారాడు !

    Tags