Flood relief: జర్మనీ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడని అంటారు. అలాగుంది ఏపీ పరిస్థితి. రాష్ర్టం వరద ముంపుతో బాధ పడుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా వేలాది మంతి నిరాశ్రయులయ్యారు. ఇళ్లు నేల మట్టమయ్యాయి. కట్టు బట్టలతో ప్రజలు ఇళ్లు విడిచి పోవాల్సిన అగత్యం ఏర్పడింది. అయినా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సైతం స్పందించడం లేదు. దీంతో ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
దీనిపై బీజేపీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి నిధులు సేకరించాలని తలపించింది. ప్రజల నుంచి విరాళాలు సేకరించి వాటిని వరద బాధితులకు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో నేతలు విజయవాడలో జోలె పట్టి బిచ్చమెత్తారు. దీని ద్వారా వచ్చే డబ్బును వారికి అందజేసి వారి కష్టాలను తీర్చాలని భావిస్తున్నారు.
Also Read: దేశంలో తగ్గుతున్న జనాభా.. వెల్లడిస్తున్న గణాంకాలు
వరద ప్రభావంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఇప్పటికే సీఎం జగన్ క్షేత్ర స్థాయికి రాకుండా ఏరియల్ సర్వే నిర్వహించడంపై విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రజల్లో ఆందోళన నెలకొంది. వారి కష్టాలు తీర్చే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల పక్షాన నిలిచేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసమే డబ్బులు సేకరించే పనికి పూనుకున్నారు. వచ్చే ఆదాయాన్ని నేరుగా వారికే అందజేసేందుకు సంకల్పించారు. ప్రభుత్వ నిర్వాకంపై విమర్శలు వస్తున్నా వారిలో కనీసం ఆత్మవిమర్శ కూడా చేసుకోకపోవడం విడ్డూరమే.
Also Read: 60 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్తు ఇది..! సీమలో భారీ నష్టం..