Kodali Nani: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సంభవించిన మరణాలపై అసెంబ్లీ వేదికగా పెద్ద దుమారమే రేగుతోంది. నాటుసారా తాగడం వల్లే మృత్యువాత పడ్డారని టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో వైసీపీ సభ్యులు తిప్పికొడుతున్నారు. టీడీపీ విధానాల వల్లే రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై రెండు వర్గాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇక వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తోంది. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన మద్యం బ్రాండ్లతోనే నష్టం జరుగుతోందని ఎదురుదాడి చేస్తోంది.
దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వారి హయాంలో 240 మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంతో ప్రజలు ఎంత నష్టాలు పడ్డారో తెలిసిందేనన్నారు. తెలుగుదేశం పార్టీ చెబుతున్నవన్ని అబద్దాలేనని జీవోలు సైతం రుజువు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇందుకు తగిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో మద్యం వ్యవహారం రెండు పార్టీల్లో రాజకీయ యుద్ధానికి కారణమవుతోంది.
Also Read: KCR Politics: ఆ వ్యతిరేక ముద్ర పోగొట్టుకునేందుకు కేసీఆర్ మరో ప్లాన్
వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు. దీంతో రాజకీయం ఎటు వైపు తిరుగుతుందో తెలియడం లేదు. సారా వ్యవహారంలో మొదలైన వివాదం ప్రస్తుతం తారా స్థాయికి చేరింది. టీడీపీ పొత్తుల కోసం దారలు తెరుస్తున్నా ఏ పార్టీ కూడా దానికి సహకరించట్లేదని తెలుస్తోందన్నారు. అందుకే రాబోయే రోజుల్లో టీడీపీ సర్వనాశనం కావడం ఖాయమేనని జోస్యం చెప్పారు. నేతల మధ్య వైరం ఇంకా ఎంత దూరం వెళుతుందో తెలియడం లేదు.
చంద్రబాబును నమ్ముకుని కార్యకర్తలు నట్టేట మునిగారని ఆరోపిస్తున్నారు. తమ తప్పులను చూపిస్తూ ఇంకా తప్పు చేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తానికి నాటుసారా వ్యవహారం శాసనసభను కుదిపేసింది. టీడీపీ సభ్యులపై వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. పరస్పర దూషణలకు దిగుతున్నారు. ఇది ఎందాక వెళ్తుందో తెలియడం లేదు. రెండు పార్టీల మధ్య వివాదం ఇంకా పెరుగుతోంది. నాటుసారా విషయం ప్రస్తుతం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది.
Also Read: పోలవరం కాంట్రాక్టర్ వర్సెస్ ఇసుక కాంట్రాక్టర్.. సీఎం జగన్ దగ్గర పంచాయితీ