https://oktelugu.com/

Ramcharan- Upasana: రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దనో తెలుసా ? ఇంత వ్యత్యాసముందా ?

Ramcharan- Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అనతికాలంలోనే విపరీతమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. తనదైన స్టైల్ లో దూసుకుపోతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కూడా అందరికీ సుపరిచితమే. చాలామందికి వీరిద్దరి మధ్య ఉన్న కొన్ని విషయాల గురించి పెద్దగా తెలియదు. వీరిద్దరిదీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 23, 2022 / 03:45 PM IST
    Follow us on

    Ramcharan- Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అనతికాలంలోనే విపరీతమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. తనదైన స్టైల్ లో దూసుకుపోతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కూడా అందరికీ సుపరిచితమే.

    చాలామందికి వీరిద్దరి మధ్య ఉన్న కొన్ని విషయాల గురించి పెద్దగా తెలియదు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. దాదాపు ఐదేళ్ళు ఉపాసనను ప్రేమించిన తర్వాత.. రామ్ చరణ్ 2012లో పెద్దల సమక్షంలో ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు. ప్రస్తుతం ఆమె అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

    Also Read:  ఆర్ఆర్ఆర్ ను తొక్కేయాలని చూస్తున్న బాలీవుడ్.. తెలుగు సినిమాపై ఎందుకింత కుట్ర

    వీరిద్దరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ లో స్టార్ కపుల్స్ గా వెలుగొందుతున్న వీరి గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి రామ్ చరణ్ ఉపాసన కంటే నాలుగేళ్లు చిన్నవాడు. కానీ వీరిద్దరి ప్రేమ విషయంలో ఆ వయసు తేడా అనేది అడ్డం రాలేదు. మొదట రామ్ చరణ్ ఉపాసనను చూసి లవ్ చేశాడు. ఉపాసన కూడా అతని నిజమైన ప్రేమను చూసి అంగీకరించింది.

    Ramcharan- Upasana

    దీంతో వారిద్దరు ఐదేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇరువురి ప్రేమ విషయాన్ని పెద్దలు అంగీకరించడంతో.. ఉపాసన మెగా కోడలు అయింది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ మార్చి 25న రిలీజ్ కాబోతోంది. ఇక మెగాస్టార్ తో చేసిన ఆచార్య మూవీ ఏప్రిల్ నెలలో వస్తుంది.

    Also Read: ఒక్క హిట్ తో హీరోలు, డైరెక్ట‌ర్ల లైఫ్ ను మార్చేసిన మూవీలు ఇవే..

    Recommended Video:

    Tags