Bollywood Media Spreading Negativity on RRR: బాలీవుడ్ లో మొదటి నుంచి మన తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. ఎక్కడి దాకో ఎందుకు తమిళంలోనే మన తెలుగు సినిమాలను మొన్నటి వరకు ఎంత చిన్నచూపు చూసేవారో మనకు తెలిసిందే. అయితే తమిళ సినిమాలు రొటీన్ కథలతో బోర్ కొట్టడంతో.. తెలుగు సినిమాలకు హైప్ పెరిగింది. ఒకప్పుడు బాలీవుడ్ లో మన తెలుగు సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ అయ్యేవి కావు.
కానీ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ఆ హవా మొదలైంది. కానీ మొదట్లో ఈ సినిమాను తొక్కేయడానికి బాలీవుడ్ మీడియా మొత్తం ప్రయత్నించింది. చాలా మంది బాలీవుడ్ యాక్టర్లు ఈ సినిమా బాగోలేదు అని ప్రచారం చేశారు. కానీ సినిమాలో దమ్ముంటే ప్రేక్షకుడు ఆటోమేటిక్ గా థియేటర్ కు వస్తాడని ఈ మూవీ నిరూపించింది. మొదట్లో డిజాస్టర్ అని చెప్పిన బాలీవుడ్ మీడియా.. బాహుబలి ప్రభంజనాన్ని తట్టుకోలేక చివరకు భుజానికి ఎత్తుకుంది.
Also Read: RRR Movie Box Office Records: బాక్సాఫీస్ పై మెగా – నందమూరి తుఫాన్
దీని తర్వాత వచ్చిన బాహుబలి-2 ఎలాంటి అడ్డంకులు లేకుండా బాలీవుడ్ ను దున్నేసింది. ఈ భాష ఆ భాష అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ లో తెలుగు సినిమాల హవా పెరిగింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సాహో రూ.150 కోట్లు వసూలు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో రిలీజ్ అయిన పుష్ప మూవీ వంద కోట్లు వసూలు చేసింది.
ఇలా మన తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేస్తూ ఉండడంతో.. తెలుగు సినిమాలపై నేషనల్ మీడియా, బాలీవుడ్ మీడియా కన్నెర్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశం మొత్తం టాప్ వన్ ట్రెండింగ్ లో ఉన్న ఆర్.ఆర్ ఆర్ మూవీనీ తొక్కేయడానికి బాలీవుడ్ మీడియా కుట్ర చేస్తోంది. అసలే రాజమౌళి సినిమా కావడంతో దీనికి ఎక్కడలేని పబ్లిసిటీ వస్తే.. తమ సినిమాలు ఆడవనే భయం పట్టుకుంది బాలీవుడ్ స్టార్లకు.
ఈ క్రమంలోనే మొన్న వచ్చిన రాదేశ్యామ్ మూవీ ప్లాప్ అయితే బాలీవుడ్ మీడియా ఎంతలా ఆటాడుకుందో చూశాం. ఇప్పుడు త్రిబుల్ ఆర్ మూవీ విషయంలో కూడా ఏదైనా చిన్న మిస్టేక్ దొరికితే.. ఆడేసుకోవాలని చూస్తోంది బాలీవుడ్. అటు నేషనల్ మీడియా కూడా త్రిబుల్ ఆర్ న్యూస్ కవరేజ్ చేయకుండా కాశ్మీర్ ఫైల్స్ ను హైలెట్ చేస్తోంది. త్రిబుల్ ఆర్ కు ఎక్కడ లేని క్రేజ్ తీసుకువస్తే.. రాబోయే కాలంలో తమ సినిమాల కంటే తెలుగు సినిమాల డామినేట్ పెరుగుతుందనే భయం బాలీవుడ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ సినిమాలో విషయం ఉంటే ఎవరెన్ని కుట్రలు చేసినా.. ప్రేక్షకులు మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. మరి జక్కన్న మాయాజాలం ముందు బాలీవుడ్ కుట్రలు ఏ మేరకు నిలుస్తాయో చూడాలి.
Also Read: అత్యధిక టికెట్లు అమ్ముడు పోయిన ఇండియన్ సినిమాలు ఇవే.. బాహుబలి స్థానం ఎంతంటే..?