Roja Satires on Nagababu: ఏ హీరో మూవీ అయినా హిట్ లేదా ప్లాపు వరకే పరిమితం అవుతుంది. కానీ వపన్ కల్యాన్ చేసిన భీమ్లానాయక్ మాత్రం రాజకీయ రగడకు దారి తీస్తోంది. ఇప్పుడు ఏపీలో భీమ్లానాయక్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టు సాగుతోంది వ్యవహారం. ఈ మూవీమీద తీవ్రమైన ఆంక్షలతో కట్టుదిట్టం చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఈ మూవీకి తగ్గించిన రేట్లకే టికెట్లు అమ్మాలనే రూల్ ఉంది.
ఎట్టి పరిస్థితుల్లో రేట్లు పెంచొద్దని నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. పైగా రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టింది. ఇక థియేటర్లలో తీవ్రమైన ఆంక్షలు విధించడంతో వివాదం ముదిరింది. గతంలో వకీల్ సాబ్ మూవీ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడు కూడా కావాలనే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మెగా బ్రదర్ నాగబాబు కూడా రియాక్ట్ అయ్యారు.
తన తమ్ముడిపై ప్రభుత్వం కక్ష గట్టిందంటూ వాపోయారు. పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయతే నాగబాబు వ్యాఖ్యలపై అటు వైసీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ వేస్తున్నారు. ఇంతలోనే తానేం తక్కువ తిన్నానా అన్నట్టు రోజా రంగంలోకి దిగారు. నాగబాబుకు వరుస కౌంటర్లు వేసేశారు. ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చే వరకు సినిమాను వాయిదా వేసుకుంటే తామేమైనా అడ్డు పడ్డామా అంటూ సెటైర్లు పేల్చారు.
Also Read: భీమ్లానాయక్ అవకాశాన్ని వాడేస్తున్న టీడీపీ.. ఆ భయంతో బీజేపీ కూడా..!
పవన్ హీరో అని, డిస్ట్రిబ్యూటర్ లేదా ప్రొడ్యూసర్ కాదు గదా.. అతనికి వచ్చిన నష్టం ఏంటంటూ తిరిగి ప్రశ్నించారు. గతంలో పెద్ద హీరోలు అయిన అల్లు అర్జున్, బాలకృష్ణ మూవీలు పుష్ప, అఖండ మూవీలకు ఉన్న రేట్లే ఇప్పుడు కూడా ఉన్నాయంటూ గుర్తు చేశారు. పైగా రేట్లు పెంచుకోవాలంటూ ప్రభుత్వం విధించిన రూల్ ప్రకారం జాయింట్ కలెక్టర్లకు అప్లై చేసుకోవాలి గానీ తమ మీద లేనిపోనివి చెప్పడం ఏంటంటూ మండిపడుతున్నారు.
తామేమీ జీవో లేట్ చేయలదేని, మంత్రి గౌతమ్ రెడ్డి మరణ వల్ల ఆలస్యం అయిందంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి తమవైపు ఏం తప్పులేదన్నట్టే రోజా కామెంట్లు చేశారు. తాము గతంలో ఉన్నట్టే ఉంచామని సర్ది చెప్పుకున్నారు. చాలా రోజుల తర్వాత రోజా మళ్లీ జగన్ మీద వచ్చిన విమర్శలకు చాలా ఫాస్ట్ గా స్పందించారు.
Also Read: పవన్ పై కక్ష సాధిస్తుంటే.. ఏ హీరో నోరు మెదపడం లేదు – నాగబాబు