Nara Lokesh: లోకేష్ ను చంద్రబాబే ఓడించారట..?

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు దుర్భాషలాడుకుంటున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న సందర్భంలో రెండు పార్టీలు తమ మాటలకు పదును పెడుతున్నాయి. చంద్రబాబు అసెంబ్లీలోనే ఇక తాను సీఎం అయ్యాకే వస్తానని శపథం చేయడం సంచలనం సృష్టించింది. దీంతో ఇరు పార్టీల నేతలు తమ ఇష్టానుసారంగా మాటలు పేల్చుతున్నారు. వైసీపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ చేసిన ఆరోపణలతో […]

Written By: Srinivas, Updated On : December 4, 2021 6:01 pm
Follow us on

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు దుర్భాషలాడుకుంటున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న సందర్భంలో రెండు పార్టీలు తమ మాటలకు పదును పెడుతున్నాయి. చంద్రబాబు అసెంబ్లీలోనే ఇక తాను సీఎం అయ్యాకే వస్తానని శపథం చేయడం సంచలనం సృష్టించింది. దీంతో ఇరు పార్టీల నేతలు తమ ఇష్టానుసారంగా మాటలు పేల్చుతున్నారు.

Chandrababu Nara Lokesh

వైసీపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ చేసిన ఆరోపణలతో కంట నీరు పెట్టుకున్న చంద్రబాబుకు క్షమాపణలు చెప్పినా ఇంకా ఆ వివాదం సద్దుమణగలేదు. దీంతో ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అధికార పార్టీని బదనం చేసి సానుభూతి పొందాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఆయన అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కొడాలి నాని బాబు, లోకేష్ గురించి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరిలో లోకేష్ ఓటమికి చంద్రబాబు కారకుడని పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. లోకేష్ ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం సీటు కావాలంటాడని భావించే కొడుకును గెలవకుండా చేశారని ఆరోపించారు దీంతో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాష్ర్టంలో ఆరోపణలు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Rosaiah Death: చిరంజీవిని రాజకీయాల్లోకి తెచ్చి.. వైఎస్ఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా మారి.. రోశయ్య ప్రస్థానం

రాజకీయం కోసం ఇంతలా దిగజారిపోవడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో లక్ష్మీపార్వతిని బూతుగా చూపించి కుట్ర చేసిన బాబుకు తగిన శాస్తి జరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాష్ర్టంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ ఏం వ్యూహాలు ఖరారు చేసుకుంటాయో తెలియడం లేదు.

Also Read: AP MPs: ఏపీ ఎంపీలు వాళ్లను చూసైనా నేర్చుకోండయ్యా..!

Tags