https://oktelugu.com/

RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్… పూనకాలకు రెడీ గా ఉండండి అంటూ

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించనున్నారు. మెగాఫ్యామిలి, నందమూరి ఫ్యామిలి హీరోలు కలిసి నటిస్తున్న ఈ మూవీపై తెలుగులోనే కాకుండా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 05:31 PM IST
    Follow us on

    RRR Movie: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించనున్నారు. మెగాఫ్యామిలి, నందమూరి ఫ్యామిలి హీరోలు కలిసి నటిస్తున్న ఈ మూవీపై తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అలియా భట్, ఒలివియా మోరిస్ లు నటిస్తున్నారు.

    అలానే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ పుఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇంకా శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ రెడీ గా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు మూవీ పై ప్రేక్షకుల్లో ఇంకాస్త భారీ అంచనాలు పెంచాయి. అయితే ఇటీవల ఈ సినిమా ట్రైలర్​ను డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా… ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల మృతి చెందిన కారణంగా ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేసినట్లు తెలిపారు. కాగా ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్​ను డిసెంబరు 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి సల్మాన్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించున్నట్లు టాక్ వినిపిస్తుంది.

    https://twitter.com/RRRMovie/status/1467094134577983488?s=20