Delhi Rlection Results 2025: ఢిల్లీ గడ్డపై కాషాయం జెండా ఎగిరింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీటాన్ని బీజేపీ(BJP) దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 47 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక 12 ఏళ్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీకి ఈసారి పరాభవం తప్పలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Liquar Scham)తోపాటు అనేక అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ఓటర్లు ఆప్‌ను ఓడించారు. ఆ పార్టీలో అవినీతి ఆరోపణలు ఎదుక్కొన్న కేజ్రీవాల్, మనీశ్‌సిసోడియా, సంత్యేంద్రజైన్‌ను కూడా ఓడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్(Exit polls) ఫలితాల తరహాలోనే వస్తున్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ ముగిసిన తర్వాత అనేక సర్వే సంస్థలు బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. ఆప్ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేశాయి. ఈ సర్వేల ప్రకారమే ఎగ్జాక్ట్ ఫలితాలు వస్తున్నాయి. అయితే ఈ సర్వేలో కేకే సర్వే భిన్నంగా అంచనాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 90 శాతం అక్యూరసితో అంచనాలు చెప్పి అందరినీ ఆశ్చర్చపర్చిన కేకే సర్వే యజమాని కిరణ్‌కొండేటి అంచనాలు ఢిల్లీలో విఫలమయ్యాయి. ఆసలు ఆయనకు నెట్‌వర్క్ ఉందా.. లేక అడిమారి గుడ్డిదెబ్బలేనా అన్నది ఎవరికీ తెలియదు. కానీ, ఎక్కడ ఎన్నికలు జరిగినా అంచనాలు వెల్లడిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరామస్తాన్(Ara Mastgan) కూడా తనది పెద్ద స్ట్రాటజిక్ కంపెనీ అని హడావుడి చేస్తారు. కానీ, ఆయన కనీసం వాస్తవానికి దగ్గరగా కూడా ఫలితాలు అంచనా వేయలేకపోయారు. దీంతో కేకే సర్వేపై చాలా మందికి నమ్మకం పెరిగింది. అయితే ఇతర రాష్ట్రాల ఫలితాలు అంచనా వేయడంలో కేకే సర్వే విఫలమై విశ్వసనీయత కోల్పోతోంది.
ఇటీవలి అంచానలు..
ఇటీవల హర్యానా ఎన్నికల్లో కేకే సర్వే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. హర్యానా ఓటర్లు అక్కడి పరిస్థితుల గురించి అధ్యయనం చేశారో లేదో తెలియదు. కానీ, కాంగ్రెస్ 75, బీజేపీకి 11 సీట్లు వస్తాయని తెలిపారు. కానీ అసలు ఫలితాలు భిన్నంగా వచ్చాయి. బీజేపీ 48 స్థానాల, కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో కేకే సర్వే ఫెయిల్ అయింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేకే సర్వే అంచనా వేసింది. ఈ ఎన్నికల్లోనూ ఆప్ భారీ విజయం సాధిస్తుందని వెల్లడించారు కిరణ్ కొండేటి(Kiran Kondeti). ఆప్ కనీసం 48 స్థానాల్లో గెలుస్తుందని ప్రకటించారు. బీజేపీ 21 స్థానాల నుంచి 24 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపారు. కానీ, వాస్తవ ఫలితాల్లో అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. బీజేపీ 48 స్థానాల్లో ఆప్ 22 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ 33 స్థానాల్లో గెలిచి 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 18 స్థానాల్లో గెలిచి 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
మహారాష్ట్రంలో కాస్త దగ్గరగా..
గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా కేకే సర్వే అంచనా వేసింది. అయితే ఈ అంచనాలు ఫలితాలకు కాస్త దగ్గరగానే వర్చాయి. అయితే కిరణ్ కొండేటికి ప్రత్యేకమైన నెట్‌వర్క్ వ్యవస్థ ఏమీ లేదని, తనకు ఉన్న ఎనలిటిక్ స్కిల్స్‌తోనే అంచనాలే వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంచి వేటగాడు కూడా కొన్నిసార్లు గురి తప్పుతాడు. కిరణ్ కొండేటి మంచి ఎలనిటికల్ స్కిల్స్ ఉన్న వ్యక్తే అయినా.. సర్వేలు ప్రకటిస్తే లాటరీ తరహాలో ఇలాగే ఉంటాయని పలువురు పేర్కొంటు