Letters on Train Coaches
Railways : భారతీయ రైల్వే నిత్యం వేలాది రైళ్లను నడుపుతూ కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రయాణించే సమయంలో రైలు భోగీలపై ప్రత్యేకమైన అక్షరాలతో పాటు కొన్ని సంఖ్యలు రాసి ఉంటాయి. ఉదాహరణకు D1, S2, B3, A1, H1 వంటి కోడ్‌లు రైల్వే కోచ్‌లపై కనిపిస్తాయి. ఈ కోడ్‌లకు అర్థం చాలా మందికి తెలియదు. ప్రయాణికులకు ఎటువంటి కోచ్‌లో ప్రయాణిస్తున్నారో, అందులో ఉన్న సౌకర్యాలు ఏమిటో తెలియజేయడానికే ఇలాంటి కోడ్ లను ఉపయోగిస్తారు. మరి, ఈ అక్షరాలకు అర్థం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
రైలు భోగీల కోడ్‌లు, వాటి అర్థం
1. జనరల్ కోచ్ (General Coach)
GN (General Non-Reserved)
ఇది జనరల్ కోచ్ అని సూచిస్తుంది.
రిజర్వేషన్ అవసరం లేదు, ట్రావెల్ కౌంటర్‌లో టికెట్ తీసుకుని ఎక్కవచ్చు. కానీ, సీటు దొరుకుతుందనే గ్యారెంటీ లేదు, ఎక్కువ జనాభా ఉండే అవకాశముంది.
2. చైర్ కార్ కోచ్‌లు (Chair Car Coaches)
D (Second Seating / Non-AC Chair Car)
D1, D2, D3 అని కోచ్‌పై ఉంటే, ఇది నాన్-ఏసీ చైర్ కార్. కేవలం కూర్చొనే సీట్లు ఉంటాయి. రిజర్వేషన్ అవసరం, కానీ ఎయిర్ కండీషన్ ఉండదు.
3. ఏసీ చైర్ కార్ కోచ్ లు( AC Chair Car Coaches)
C (AC Chair Car)
C1, C2, C3 అనే కోడ్ ఉంటే, ఇది AC చైర్ కార్ కోచ్. షటాబ్ది, గతిమాన్, వందే భారత్ రైళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. కూర్చొనే సీట్లు మాత్రమే ఉంటాయి.
4. ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్ లు E (Executive AC Chair Car)
E1, E2, E3 ఉంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్ అని అర్థం. ఇది AC Chair Car కంటే అధిక సౌకర్యాలతో ఉంటుంది. ఎక్కువ లగ్జరీ ఫీచర్లు కావాలనుకునే ప్రయాణికులు దీనిని ఎంచుకుంటారు.
5. స్లీపర్ కోచ్‌లు (Sleeper Coaches)
S (Sleeper Class)
S1, S2, S3… అనే కోడ్ ఉంటే, ఇది స్లీపర్ క్లాస్ కోచ్. పెద్ద ప్రయాణాలకు ఉపయోగించే సాధారణ కోచ్, ఎయిర్ కండీషన్ ఉండదు. పడుకునే బెర్తులు ఉంటాయి (ఉప్పర్, మిడిల్, లోయర్).
4. ఎయిర్ కండీషన్డ్ కోచ్‌లు (AC Coaches)
B (AC 3-Tier)
B1, B2, B3… అనే కోడ్ ఉంటే, ఇది AC 3-Tier (3A) కోచ్. మూడు స్థాయిలుగా బెర్తులు ఉంటాయి. మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించే AC కోచ్.
A (AC 2-Tier)
A1, A2, A3… ఉంటే, ఇది AC 2-Tier (2A) కోచ్. AC 3-Tier కంటే ఎక్కువ స్పేస్, మరింత సౌకర్యాలు ఉంటాయి.
H (AC First Class)
H1, H2, H3… ఉంటే, ఇది AC First Class (1A). అత్యంత లగ్జరీ, ప్రైవేట్ క్యాబిన్లు ఉంటాయి. ధర అత్యధికంగా ఉంటుంది.
HA (AC First Class + AC 2-Tier Mixed Coach)
HA1, HA2… ఉంటే, ఇది 1A + 2A కలిపిన కోచ్. కొన్నిసార్లు 1A కోచ్‌ల సంఖ్య తక్కువగా ఉండటంతో 2A తో కలిపి ఈ కోడ్ వాడతారు.
ఈ కోడ్‌లు ఎందుకు ఉపయోగిస్తారు?
ప్రయాణికులకు తమ కోచ్ ఎక్కడ ఉందో త్వరగా గుర్తించడానికి, ఏ కోచ్‌లో ఏ సౌకర్యాలు ఉంటాయో తెలుసుకోవడానికి, రైలు బుకింగ్ చేసుకునే సమయంలో సరైన కోచ్‌ను ఎంచుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.
ఉదాహరణకు B2 అంటే ఇది AC 3-Tier Coach (3A) లోని రెండో కోచ్. S5 అంటే ఇది స్లీపర్ కోచ్‌లోని ఐదో భోగి. C1 అంటే ఇది AC Chair Car (CC) లోని మొదటి కోచ్. ఇకపై రైలు ప్రయాణంలో మీరు ఏ కోచ్‌లో ఉన్నారో, ఏ కోచ్‌లో ఏ సౌకర్యాలు ఉన్నాయో సులభంగా గుర్తించవచ్చు.