ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అరెస్టుపై కిషన్ రెడ్డి సీరియస్.. పోలీసులు, ఈవో సస్పెండ్?

శ్రీశైల ఆలయ దర్శనం విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ఇదికాస్తా ఉద్రిక్తత పరిస్థితులు దారితీసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్ఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు చేయి  చేసుకొని స్టేషన్ కు తరలించారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. Also Read: ప్రధానితో భేటికి కేసీఆర్, జగన్.. ఏం జరుగుతోంది? కర్నూలులోని శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆర్ఎస్ఎస్ […]

Written By: NARESH, Updated On : September 20, 2020 2:29 pm

Logo_of_RSS

Follow us on


శ్రీశైల ఆలయ దర్శనం విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ఇదికాస్తా ఉద్రిక్తత పరిస్థితులు దారితీసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్ఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు చేయి  చేసుకొని స్టేషన్ కు తరలించారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

Also Read: ప్రధానితో భేటికి కేసీఆర్, జగన్.. ఏం జరుగుతోంది?

కర్నూలులోని శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీగా వచ్చారు. అయితే దైవదర్శనానికి సమయం మించిపోయిందని పోలీసులకు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వారిపై చేయిచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ విషయాన్ని ఆర్ఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నేరుగా డీజీపీ గౌతం సవాంగ్ తో మాట్లాడారు. ఆర్ఎస్ఆర్ కార్యకర్తలపై చేయిచేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. నలుగురి పోలీసులను ట్రాన్స్ ఫర్  చేయగా ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ట్రబుల్ షూటర్ ఎంట్రీ.. ‘దుబ్బాక’ ఫలితం మారనుందా?

దీంతోపాటు శ్రీశైలం చీఫ్ సెక్యూరిటీ అధికారిపై కూడా బదిలీ వేటు పడింది. ఇక అరెస్టు అయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పోలీసులు వెంటనే విడుదల చేసి పంపించారు. ఈ సంఘటనపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై చేయిచుకున్నందుకు పోలీసులకు తగిన మూల్యం చెల్లించుకున్నారనే టాక్ విన్పిస్తోంది.