సాధారణంగా ఏ పార్టీ నేతలైనా మరో పార్టీ నేతలపై విమర్శలు చేయడానికి, తమ భావాలను వ్యక్తపరచటానికి చాలా మార్గాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కొందరు నేతలు మాత్రం పార్లమెంట్ లో రాజకీయపరమైన విమర్శలు, కామెంట్లు చేస్తూ పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు. పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆరోపణలు చేసుకుంటూ ఏపీ పరువును పోగొడుతున్నారు. వైసీపీ ఎంపీలు అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
Also Read : విపక్షాల సంచలనం.. డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాసం
అదే సమయంలో టీడీపీ ఎంపీలు మాత్రం ఏపీకి అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని… రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని… కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. పార్లమెంట్ వేదికగా ఇరు పార్టీల నేతలు అంతర్వేది ఘటనతో పాటు అనేక అంశాలు తెరపైకి తెస్తున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ నేతలు ఘాటు విమర్శలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల ముందు ఏపీ చులకన కావడానికి కారణమవుతున్నారు.
ఇలాంటి రాజకీయాల వల్లే ఏపీలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. పారిశ్రామికవేత్తలు సైతం ఏపీలో రాజకీయాలను చూసి ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏ పార్టీ అయినా రాష్ట్రంలోనే సమస్యలు పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపుతాయి. కానీ వైసీపీ టీడీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజల దృష్టిలో చులకనవుతున్నాయి.
అవసరమైన విషయాలను పార్లమెంట్ దృష్టికి తెస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది కానీ ఇలాంటి చిల్లర రాజకీయాల వల్ల ఏ పార్టీకి ప్రయోజనం చేకూరదు. రాజకీయ నేతలంటే ఒకింత హుందాతనంతో వ్యవహరించాలి. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూ ఉండటం గమనార్హం. నేతలు ఈ విధంగా చేయడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందని ప్రజల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read : ఇష్టమున్నట్టు ఉద్యోగులను తీసేయండి.. మోడీ దారుణ నిర్ణయం?