https://oktelugu.com/

Kishan Reddy: కిషన్ రెడ్డిదే కీరోల్.. తెలుగు సీఎంలదే ఆలస్యం

Kishan Reddy: తెలుగు స్టేట్లలో జలవివాదాల సమస్య జటిలమవుతోంది. రోజురోజుకు సమస్య తీవ్రత పెరిగిపోతోంది. నేతల మధ్య దూరం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ఆఫర్ తెరమీదకు తెచ్చారు. రెండు ప్రాంతాల సమస్యను తాను పెద్దన్న పాత్ర పోషించి తేల్చుతానని ప్రకటించారు. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. కిషన్ రెడ్డికి అంత సీన్ ఉందా అనే అనుమానాలు కూడా కొందరిలో పుట్టుకొస్తున్నాయి. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 12, 2021 / 10:37 AM IST
    Follow us on

    Kishan Reddy: తెలుగు స్టేట్లలో జలవివాదాల సమస్య జటిలమవుతోంది. రోజురోజుకు సమస్య తీవ్రత పెరిగిపోతోంది. నేతల మధ్య దూరం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ఆఫర్ తెరమీదకు తెచ్చారు. రెండు ప్రాంతాల సమస్యను తాను పెద్దన్న పాత్ర పోషించి తేల్చుతానని ప్రకటించారు. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. కిషన్ రెడ్డికి అంత సీన్ ఉందా అనే అనుమానాలు కూడా కొందరిలో పుట్టుకొస్తున్నాయి. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి తనదైన శైలిలో వారిని సముదాయించి మాట వినేలా చేసుకోవడం ఆయనకు చెల్లుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

    తెలుగు ప్రాంతాల ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే సమస్య ఇంత దూరం వచ్చిందని తెలుస్తోంది. కిషన్ రెడ్డికి రెండు ప్రాంతాల నేతలను కూర్చోబెట్టి లీడ్ చేసేంత సత్తా ఉందా అనే సందేహాలు నెలకొంటున్నాయి. కేంద్రంలో కేబినెట్ స్థాయి నేత అయినా ఆయనలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఆయన అంత పవర్ ఫుల్ నేతగా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య సమస్యను పరిష్కరిస్తానని ఆఫర్ ఇవ్వడంపై పార్టీ నేతల్లో సైతం ఆశ్చర్యం కలుగుతోంది.

    ఇప్పటికే జల వివాదాల విషయంలో ఇరు ప్రాంతాలు ఎంతకూ తగ్గడం లేదు. ఎవరి గోల వారిదే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో కేంద్రం చేతుల్లోకి తీసుకుంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి నదీ జలాల విషయాలు నదీ యాజమాన్య బోర్డులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో స్నేహితులుగా ఉన్న నేతల్లో దూరం అందుకోలేనంతగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రమంత్రి మధ్యవర్తి పాత్ర పోషిస్తానని చెప్పడం గమనార్హం.

    కానీ కిషన్ రెడ్డి పెద్దరికాన్ని రెండు ప్రాంతాల నేతలు కేసీఆర్, జగన్ విశ్వసిస్తారా అన్నదే సంశయం. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే పోయే సమస్యను ఇంతలా పెంచుకోవడంలో ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో నదీ జలాల సమస్యను పరిష్కారం చేసే దిశగా కిషన్ రెడ్డి ఆలోచించడం ఆహ్వానించదగినదే. జల పంచాయతీని సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకే నిర్ణయించుకోవడంతో కిషన్ రెడ్డి పెద్దరికాన్నిఒప్పుకుంటారా అనేదే ప్రశ్న. కిషన్ రెడ్డి లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని ముందుకు రావడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది.