https://oktelugu.com/

Sai Dharma Tej Accident : సాయితేజ్ ప్రమాదంపై బాబు మోహన్.. తండ్రి శరీరం కాలే వరకు ఆ బాధ

Sai Dharma Tej Accident : హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్క సినీ సెలబ్రెటీ స్పందిస్తున్నారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ సాయి ప్రస్తుతం జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాయిధరమ్ ప్రమాదంపై సీనియర్ […]

Written By: , Updated On : September 12, 2021 / 10:45 AM IST
Follow us on

Babu Mohan Becomes Emotional Over Sai Dharma Tej Accident

Sai Dharma Tej Accident : హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్క సినీ సెలబ్రెటీ స్పందిస్తున్నారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ సాయి ప్రస్తుతం జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాయిధరమ్ ప్రమాదంపై సీనియర్ కమెడియన్ బాబు మోహన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడి మరణాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.

బాబు మోహన్ కుమారుడు కూడా స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించారు. యాక్సిడెంట్ లో తన కుమారుడి మరణాన్ని ఎప్పటికీ మరచిపోలేనని చెప్పారు. సరదా కోసం ప్రాణాలతో ఎవరూ చెలగాటం ఆడొద్దని బాబుమోహన్ చెప్పుకొచ్చారు.

ప్రమాదంలో మరణించిన వారు పోతారు కానీ.. వారిని ప్రేమించే వారు మాత్రం నిత్యం మానసిక క్షోభ అనుభవిస్తారని బాబు మోహన్ వాపోయారు. ప్రతి ఒక్కరూ దీనిని ఆలోచించుకోవాలని అని వాపోయారు. సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకొని మంచి పనిచేశాడన్న మోహన్ బాబు తెలిపారు.

‘కొందరు హెల్మెట్ పెట్టుకోవడాన్ని నామోషీలా ఫీలవుతారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై బైక్ నడుపుతూ థ్రిల్ ఫీల్ అయ్యి యాక్సిడెంట్కాగానే చతికిలిపడుతారు. అతన్ని నమ్ముకున్న వాళ్లు చీకట్లోకి వెళ్లిపోతారు. దీనికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ తండ్రి తన కళ్లముందు కుమారుడిని కోల్పోతే.. తండ్రి శరీరం కాలిపోయే వరకు ఆ దు:ఖం ఉంటుంది. ఆ బాధను ఎవరూ తగ్గించలేరు. దయచేసి అందరూ తమ కుటుంబాలను గుర్తు చేసుకొని బైక్ నడపాలి’ అని బాబు మోహన్ ఎమోషనల్ అయ్యారు.