ఆంధ్రప్రదేశ్ గవర్నర్ త్వరలోనే మారబోతున్నారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ఏపీలో బలపడేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. దీనిలో భాగంగానే త్వరలోనే గవర్నర్ మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగారు. ఆయన స్థానంతో తెలంగాణకు తమిళ సై సుందరరాజన్, ఏపీకి ఒరిస్సాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్లుగా నియమాకం అయిన సంగతి తెల్సిందే. తెలంగాణ గవర్నర్ తమిళ సై కేంద్రం నిర్ణయం మేరకు నడుస్తుండగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సొంత నిర్ణయాలతో ముందుకెళుతున్నారు. దీంతో ఆయనను ఏపీ నుంచి తప్పించేందుకు కేంద్రం ఆలోచిస్తుందనే టాక్ విన్పిస్తుంది.
Also Read: తమ్మినేని మౌనం వెనుక కారణం అదేనా?
ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న పలు సంఘటనలు ఇందుకు కారణమని తెలుస్తోంది. మూడు రాజధానుల విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ కేంద్రాన్ని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం కేంద్రానికి తలనొప్పిగా మారిందట. అదేవిధంగా ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియామకమైన నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలోనూ గవర్నర్ ఇలాంటి దూకుడు నిర్ణయమే తీసుకోవడం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనిపై అప్పట్లో కేంద్రంపై హైకోర్టు వ్యక్తం చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ గవర్నర్ సొంత నిర్ణయాల కారణంగా కేంద్రంలోని బీజేపీ ఇరుకున పడుతుండటంతో ఆయనను తప్పించేందుకు బీజేపీ యత్నిస్తుందనే టాక్ విన్పిస్తుంది.
Also Read: చంద్రబాబు మౌనం.. మరణ శాసనమేనా?
మూడురాజధానులపై గవర్నర్ సంతకం, నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరుతో కేంద్రం ఇరుకున పడింది. దీంతో ఆయన పక్కకు తప్పించి ఆయన స్థానంలో వేరే వారిని నియమించే పనిలో బీజేపీ సర్కార్ ప్రయత్నాలు మొదలేట్టింది. ఈ లిస్టులో పాండిచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ గా పని చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ పేరు తెరపైకి వస్తోంది. కిరణ్ బేడీని ఏపీ గవర్నర్ గా నియమిస్తే సీఎం జగన్ దూకుడుకు కూడా కళ్లెం వేయొచ్చని కేంద్రం భావిస్తుందట. అయితే గతంలోనే కిరణ్ బేడీని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. దీంతో కిరణ్ బేడీ విషయంలో మోడీ-అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!