ముచ్చటగా మూడవ సారి వాయిదా..!

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన ఇళ్ల స్థలాల పంపిణీకి ముందడుగు పడటం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఈ పథకం ముచ్చటగా మూడవ సారి వాయిదా పడింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం వేడుకలతోపాటు ఇళ్ళ స్థలాల పంపిణీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి 29 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేయాలని భావించారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని తాజాగా మరోమారు అక్టోబరు 2 గాంధీ జయంతి […]

Written By: Neelambaram, Updated On : August 12, 2020 8:54 pm
Follow us on


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన ఇళ్ల స్థలాల పంపిణీకి ముందడుగు పడటం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఈ పథకం ముచ్చటగా మూడవ సారి వాయిదా పడింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం వేడుకలతోపాటు ఇళ్ళ స్థలాల పంపిణీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి 29 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేయాలని భావించారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని తాజాగా మరోమారు అక్టోబరు 2 గాంధీ జయంతి నాటికి వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read: జేసీ సోదరులకు బీజేపీ తలుపులు మూసిందా?

ఇందుకు కారణం ప్రధానంగా పట్టాల పంపిణీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు ఈ నెల 16వ తేదీన ప్రధానితో మూడు రాజధానుల శంకుస్థాపనతోపాటు ఇళ్ల పట్టాల పంపిణీ కూడా ప్రధాని ఆధ్వర్యంలో ప్రారంభించాలని సిఎం భావించారు. మూడు రాజధానుల శంకుస్థాపన రద్దు కావడం కూడా దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను ఐదేళ్ల అనంతరం అమ్మకోవచ్చనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. హై కోర్టు ఈ ఉత్తర్వులు చట్ట విరుద్దమని కోట్టేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఆ కేసు ఇప్పటికీ తేలకపోవడంతో ఈ విషయంలోను సందిగ్ఘత నెలకొంది.

తొలుత మార్చి 25వ తేదీన ఉగాది పండుగు సందర్భంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలులో ఉండటంతో పథకాన్ని ప్రారంభించలేదు. అనంతరం జూలై నెల 8వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పడు లాక్ డౌన్ తోపాటు, స్థలాలకు ఎంపిక చేసిన భూములపై న్యాయస్థానాల్లో కేసులు ఉండటం, ప్రభుత్వంపట్టాల నిబంధనలపై న్యాయస్థానం అభ్యంతరాలు తదితర అంశాలతో మరోమారు వాయిదా పడింది.

Also Read: తమ్మినేని మౌనం వెనుక కారణం అదేనా?

అయితే ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసి భారీ స్థాయిలో లే అవుట్ లు వేశారు. భూముల కొనుగోలు విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇళ్ల స్థలాల సేకరణ విషయంలో అక్రమాలు జరిగాయని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో అవ భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడంపై పెద్ద దుమారం రేగింది. స్థానికులు, టీడీపీ న్యాయస్థాన్ని ఆశ్రయించారు. కొన్ని గ్రామాల్లో చెరువును పూడ్చి ఇళ్ల స్థలాలుగా మార్చారు. మరికొన్ని చోట్ల కొండలపై ఇళ్ల స్థలాలు కేటాయించడం వివాదస్పదమయ్యింది.