Khel Ratna: భారత ‘ఖేల్ రత్న’లు.. 12 మందికి పురస్కారాలు

Khel Ratna: భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాల ప్రధానం జరిగింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న2021’ అవార్డులతోపాటు అర్జున, లైఫ్ ఎచీవ్ మెంట్ పురస్కారాలను రాష్ట్రపతి భవన్ల ోని దర్భార్ హాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ క్రీడాకారులకు అందించారు. అత్యున్న క్రీడా పురస్కారాన్ని ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాతోపాటు రవికుమార్, లవ్లీనా, శ్రీజేష్, అవని, సుమిత్, ప్రమోద్, […]

Written By: NARESH, Updated On : November 13, 2021 7:27 pm
Follow us on

Khel Ratna: భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాల ప్రధానం జరిగింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న2021’ అవార్డులతోపాటు అర్జున, లైఫ్ ఎచీవ్ మెంట్ పురస్కారాలను రాష్ట్రపతి భవన్ల ోని దర్భార్ హాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ క్రీడాకారులకు అందించారు.

khel-ratna-award

అత్యున్న క్రీడా పురస్కారాన్ని ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాతోపాటు రవికుమార్, లవ్లీనా, శ్రీజేష్, అవని, సుమిత్, ప్రమోద్, కృష్ణనగర్, మనీజ్, మిథాలీరాజ్, సునీల్ చెత్రి, మన్ ప్రీత్ సింగ్ అందుకున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 12 మందికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని ప్రకటించడం విశేషం.

భారత జట్టు క్రికెటర్ శిఖర్ ధావన్ కు అర్జున అవార్డు ప్రకటించారు. ధ్రోణాచార్య అవార్డులను కోచ్ లకు ప్రకటించారు. జాతీయ అడ్వెంచర్ అవార్డులను లైవ్ ఎచీవ్ మెంట్ కింద పలువురికి ప్రధానం చేశారు.