Akhanda Movie: బాలయ్య అభిమానులకు అదిరిపోయే అప్డేట్… “అఖండ” ట్రైలర్ ఎప్పుడంటే ?

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా “అఖండ”. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా… శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 13, 2021 7:32 pm
Follow us on

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా “అఖండ”. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా… శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ మూవీ యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మేరకు నవంబర్ 14 వ తేదీన రాత్రి 7.09 గంటలకు అఖండ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్ లో బాలయ్య సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. త్రిశూలం పట్టుకొని ఒంటికాలిపై బాలయ్య నిలబడి ఉండడం పోస్టర్ లో గమనించవచ్చు. ఇక ఈ తాజా అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజే ఈ మూవీ కి సంబంధించి పూజ కార్యక్రమాలను లాంఛనంగా నిర్వహించారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక పాత్రలో అఘోరాగా, మరో పాత్రలో రాయలసీమ వ్యక్తిగా కనిపించ బోతున్నారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పాటలు, ప్రోమో లకు మంచి స్పందన వస్తుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

https://twitter.com/dwarakacreation/status/1459493748019245056?s=20