Chandrababu: చంద్రబాబుపై చర్యల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి రాజధానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనల్లో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూర్చారని చంద్రబాబుపై అభియోగాలు మోపుతూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రి నారాయణ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, చంద్రబాబు అనుచరులు భారీగా లబ్ది పొందారని సిఐడి అభియోగాలు మోపింది.

Written By: Dharma, Updated On : November 24, 2023 6:02 pm

Chandrababu

Follow us on

Chandrababu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం కేసు విచారణ వాయిదా వేసింది. అటు ఇసుక పాలసీ కేసులో సైతం హైకోర్టు ఇదే తరహా తీర్పు చెప్పింది.

అమరావతి రాజధానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనల్లో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూర్చారని చంద్రబాబుపై అభియోగాలు మోపుతూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రి నారాయణ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, చంద్రబాబు అనుచరులు భారీగా లబ్ది పొందారని సిఐడి అభియోగాలు మోపింది. భారీగా క్విడ్ ప్రోకు పాల్పడ్డారని.. అటు హెరిటేజ్ సంస్థకు సైతం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనల్లో భారీగా లబ్ధి చేకూర్చారని అభియోగాలు మోపింది. దీనిపై ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో వాదనలు సాగాయి.

అసలు వేయని రోడ్డు నిర్మాణంలో అవినీతి ఎలా అని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. అసలు రింగ్ రోడ్డుకు రూపాయి ఖర్చు చేయలేదని.. అటువంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని.. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేసినదేనిని.. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.

అయితే ఈ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ న్యాయవాదులు సైతం తమదైన రీతిలో వాదనలు వినిపించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ప్రతిపాదనల్లో చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ భారీ అవకతవకలకు పాల్పడ్డారని.. అస్మదీయులకు ఆయాచిత లబ్ధి చేకూర్చాలని వాదనలు వినిపించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తరములు ఇచ్చేవరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.