Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఈ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. కొందరు ఉన్న ఇమేజ్ ను కూడా పోగొట్టుకున్నారు. అయితే ఈ షోలో ఉన్న టాస్క్ లు, రిలేషన్ ద్వారానే ప్రేక్షకుల్లో పాజిటివ్ నెగిటివ్ సంపాదిస్తుంటారు. వారి బిహేవియర్ ను బట్టి కొన్ని సందర్భాల్లో ఓట్లు కూడా పడుతుంటాయి. అయితే ఈ ఏడవ సీజన్ లో ఉల్టా పుల్టా అంటూ కొత్తగా ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్. ఈ సీజన్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కంటెస్టెంట్లలో అమర్ దీప్ ఒకరు. ఇక ఈయన గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
టాప్ 5 కంటెస్టెంట్లలో అమర్ దీప్ కూడా ఉంటారని నెటిజన్లు ఫీలవుతున్నారు. అమర్ దీప్ కు పలువురు సెలబ్రెటీల సపోర్ట్ కూడా లభిస్తోంది. అయితే అమర్ దీప్ ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ కు ఫిట్స్ వచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నటుడు అస్వస్థతకు గురయ్యాడని చెబుతూ జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పడుతోంది. ఈ విషయంపై అమర్ స్నేహితుడు నరేష్ స్పందించారు.
అమర్ దీప్ కు ఫిట్స్ రావడం నిజమే అన్నారు నరేష్. అంతే కాదు నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. నీతోనే డాన్స్ షోలో పాల్గొన్న దగ్గర నుంచే శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్నారని తెలిపారు. రెస్ట్ లేకుండా పని చేయడం వల్ల అమర్ దీప్ ఇబ్బందులు పడ్డాడట. అంతే కాదు అమర్ దీప్ ను నరేష్ కు తెలిసిన డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్తే కండరాల ఎదుగుదల జీరో అయిందని తెలిసిందట. రెండు నెలల నుంచి అమర్ కు మజిల్ గ్రోత్ లేదని.. దీంతో ఈ సమస్య ఆయనకు పెద్ద బ్యాక్ డ్రాప్ అంటూ కామెంట్లు చేశారు నరేష్.
బిగ్ బాస్ షోకు వెళ్లడానికి రెండు రోజుల ముందు మాత్రమే అమర్ దీప్ కంటి నిండా నిద్ర పోయాడని నరేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాదు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారని.. ఆయనకు శరీరం సహకరించడం లేదని, సరిగ్గా నిద్ర పోవడం లేదని తెలిపారు. దీంతో అమర్ దీప్ అభిమానులు మా హీరో ఇన్ని సమస్యలతో బాధ పడుతున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.