TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కీలక పరిణామం: తండ్రి కొడుకుల అరెస్టు

TSPSC Paper Leak: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ కి సంబంధించి శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసిన సిట్ అధికారులు.. తాజాగా తండ్రి కొడుకులను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 19 మందికి చేరుకుంది.. శుక్రవారం సిట్ అధికారులు మహ బూబ్ నగర్ జిల్లాకు చెందిన మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్ ను అరెస్ట్ చేశారు. జనార్దన్ కోసం అతని […]

Written By: Bhaskar, Updated On : April 21, 2023 3:49 pm
Follow us on

TSPSC Paper Leak

TSPSC Paper Leak: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ కి సంబంధించి శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసిన సిట్ అధికారులు.. తాజాగా తండ్రి కొడుకులను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 19 మందికి చేరుకుంది.. శుక్రవారం సిట్ అధికారులు మహ బూబ్ నగర్ జిల్లాకు చెందిన మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్ ను అరెస్ట్ చేశారు. జనార్దన్ కోసం అతని తండ్రి మైబయ్య డాక్యా నాయక్ దగ్గర ఏఈ ప్రశ్న పత్రం కొనుగోలు చేసినట్టు సిట్ అధికారులు వెల్లడించారు.

మైబయ్య వికారాబాద్ జిల్లా ఎంపీడీవో కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. డాక్యా నాయక్ కూడా టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తుండడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే తన వద్ద ఏఈ ప్రశ్న పత్రం ఉందని మైబయ్యకు డాక్యా నాయక్ చెప్పాడు.. అయితే దీనికోసం ఆరు లక్షలు డిమాండ్ చేశాడు. తన వద్ద రెండు లక్షలు మాత్రమే ఉన్నాయని, అవి మాత్రమే ఇస్తానని మైబయ్య స్పష్టం చేశాడు..ఆ డబ్బును డాక్యా నాయక్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశాడు..దాన్ని మైబయ్య తన కుమారుడు జనార్ధన్ కు ఇచ్చి పరీక్ష రాయించాడు.

TSPSC Paper Leak

సిట్ అధికారులు విచారణ సాగిస్తున్న సమయంలో డాక్యా నాయక్ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు నిర్వహించి పక్కా ఆధారాలతో మైబయ్య, అతడి కుమారుడు జనార్దన్ ను అరెస్టు చేశారు.. దీంతో ఈ కేసులో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నలుగురు అరెస్ట్ కావడం సంచలనం రేకెత్తిస్తోంది.. అయితే ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన సుస్మిత దంపతులు తమ కారు అమ్మి టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రం కొనుగోలు చేశారు. సిట్ అధికారుల దర్యాప్తులో ఈ విషయం వెల్లడి కావడంతో వారిని అరెస్టు చేశారు. గత శనివారం ఖమ్మంలో వారి ఇంటికి వచ్చి విచారణ కూడా నిర్వహించారు.

అయితే పేపర్ లీకేజీ కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది అరెస్టు అవుతారనేది అంతుపట్టకుండా ఉంది. కేసులో కీలక నిందితులు ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ బ్యాంకు ఖాతాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. మీరు ఎవరెవరితో లావాదేవీలు నిర్వహించారో తెలుసుకుంటున్నారు. స్థూలంగా చూస్తే ఈ కేసు ఇప్పట్లో పరిష్కారమయ్యే మార్గాలు కనిపించడం లేదు. పైగా కీలక నిందితులు రోజుకు ఒక కొత్త విషయం చెబుతున్న నేపథ్యంలో.. మరిన్ని మలుపులు అవకాశం ఉందని తెలుస్తోంది.