https://oktelugu.com/

ఆ మహిళ చేసిన పనికి ఐపీఎస్ ఫిదా

మానవుడు చేసే పాపాల వల్లే కరోనా లాంటి కొత్త రోగాలు పుట్టికొస్తున్నాయి. మానవత్వం మంటగలిచేలా జంతువులను క్రూరంగా హింసించడం, వాటి బాధను చూసి ఆనంద పడటం, వాటిని పిక్కుతినడం, ప్రకృతి సంపదను విచ్చలవిడిగా సొంతానికి వాడుకోవడం వల్లే మానవళి నాశనం దిశగా వెళుతుందనే వాదనలు ఉన్నాయి. తోటివారికి సాయం చేసే గుణమే మానవుల్లో కరువైపోయింది. అమ్మనాన్న, అక్కతమ్ముడు లాంటి బంధుత్వాలు కూడా కమర్షియల్ గా మారిపోతుండటం నిత్యం ఏదోఒక చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలోనూ మానవత్వం బతికే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 9, 2020 / 06:02 PM IST
    Follow us on


    మానవుడు చేసే పాపాల వల్లే కరోనా లాంటి కొత్త రోగాలు పుట్టికొస్తున్నాయి. మానవత్వం మంటగలిచేలా జంతువులను క్రూరంగా హింసించడం, వాటి బాధను చూసి ఆనంద పడటం, వాటిని పిక్కుతినడం, ప్రకృతి సంపదను విచ్చలవిడిగా సొంతానికి వాడుకోవడం వల్లే మానవళి నాశనం దిశగా వెళుతుందనే వాదనలు ఉన్నాయి. తోటివారికి సాయం చేసే గుణమే మానవుల్లో కరువైపోయింది. అమ్మనాన్న, అక్కతమ్ముడు లాంటి బంధుత్వాలు కూడా కమర్షియల్ గా మారిపోతుండటం నిత్యం ఏదోఒక చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలోనూ మానవత్వం బతికే ఉందని ఓ మహిళ నిరూపించింది.

    కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

    కేరళీయులు మరోసారి వారి మంచి గుణాన్ని ప్రపంచానికి చాటారు. కేరళలో ఓ అంధుడు బస్సు కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు. అయితే బస్సు వచ్చి వెళుతున్న విషయాన్ని అతడు గమనించలేదు. వెంటనే అక్కడే ఉన్న ఓ మహిళ బస్సు వెళుతుండటాన్ని గమనించి పరుగెత్తుకుంటూ వెళ్లి బస్సును ఆపేసింది. కండక్టర్ ను బస్సును ఆపాలని కోరి తిరిగి ఆ వృద్ధుడి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి అతడిని బస్సులోకి ఎక్కించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

    ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

    ఇదంతా రోడ్డుపై ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ వీడియోను విజ‌య్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆ మహిళ చూపిన మానవత్వాన్ని ఆయన ప్రశంసిస్తూ.. ప్రపంచంలో ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపించిందని ట్వీట్ చేశారు. ఒక్కరోజులోనే ఈ వీడియోకు 46.4వేల లైక్స్, 9వేల రీట్వీట్స్ రావడం గమనార్హం. పక్కనున్నోడు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే సెల్ఫీ దిగి వీడియోలు పోస్టు చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారని సదరు మహిళ నిరూపించి ఇంకా మానవత్వం బతికే ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మహిళను ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్ చేసున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    https://twitter.com/vijaypnpa_ips/status/1280815032490549248