భార్యతో ఎఫైర్.. ప్రియుడిని అక్కడ కాల్చేసిన భర్త

పెళ్లినాటి ప్రమాణాలు మరిచిపోయారు. నూరేళ్లు కలిసుంటామని చేసిన బాసలు వదిలేశారు. క్షణికావేశంలో బంధుత్వాన్నే దూరం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. 18 ఏళ్ల సంసారానికి చరమగీతం పాడాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఇదే సందర్భంలో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తకు కోపం వచ్చి రివాల్వర్ తో ప్రియుడి మర్మాంగాన్ని కాల్చిన సంఘటన ఒకటి సంచలనంగా మారింది. భర్త హెచ్చరికలను పట్టించుకోని భార్యకు చేసిన ఘాతుకంపై కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కేరళలోని అలప్పుజ […]

Written By: Srinivas, Updated On : July 28, 2021 3:27 pm
Follow us on

పెళ్లినాటి ప్రమాణాలు మరిచిపోయారు. నూరేళ్లు కలిసుంటామని చేసిన బాసలు వదిలేశారు. క్షణికావేశంలో బంధుత్వాన్నే దూరం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. 18 ఏళ్ల సంసారానికి చరమగీతం పాడాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఇదే సందర్భంలో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తకు కోపం వచ్చి రివాల్వర్ తో ప్రియుడి మర్మాంగాన్ని కాల్చిన సంఘటన ఒకటి సంచలనంగా మారింది. భర్త హెచ్చరికలను పట్టించుకోని భార్యకు చేసిన ఘాతుకంపై కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

కేరళలోని అలప్పుజ జిల్లాలోని చెంగన్నూర్ ప్రాంతంలో వసంత్ (46), సంగీత(42) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. ఇద్దరికి పడకపోవడంతో విడాకులు తీసుకోవాలని భావించారు. దీంతో కోర్టును ఆశ్రయించారు. వసంత్, సంగీత వేరువేరుగా కాపురం ఉంటున్నారు. అలప్పుజ జిల్లాలోని ముండనకవి ప్రాంతంలో ఉంటున్న సంగీతకు కొద్ది రోజులుగా రాజేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధంఏర్పడింది. దీంతో భర్తను దూరం పెడుతోంది. పరాయి వ్యక్తితో జల్సాలకు అలవాటు పడింది. కారుల్లో షికార్లు చేస్తూ వస్తోంది.

ఇటీవల కాలంలో సంగీతతో కలిసి రాజేష్ కారు, ద్విచక్ర వాహనాల్లో నిరంతరం తిరుగుతోంది. రాజేష్ నిరంతరం ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో వసంత్ పద్దతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా సంగీత ప్రవర్తలో మార్పు రాకపోవడంతో విడాకులు తీసుకునే వరకు వేచి ఉండాల్సిందిగా సూచించాడు. అయినా ఆమె లెక్కచేయకపోవడంతో రాజేష్ కు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో సంగీత ఇంటికి వెళ్లిన రాజేష్ సంగీతతో మంచి రొమాన్స్ మూడ్ లో ఉండడం గమనించాడు. వెంటనే ఎయిర్ గన్ (తుపాకీ) తీసుకుని రాజేశ్ మర్మాంగంపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. మర్మాంగం మీద మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో రాజేశ్ మర్మాంగం గుత్తిని గట్టిగా పట్టుకుని ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. బాధతో గిలగిలలాడిపోయాడు. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెంగన్నూర్ డీఎస్పీ ఆర్. జోష్ చెప్పారు.