కంటిన్యూ: దేశంలో వారసత్వ రాజకీయం

నాన్న రాజకీయ బాట పరుస్తారు. కష్టపడి అధికారంలోకి వచ్చి కుమారులకు పూలపాన్పు పరుస్తారు. కుమారులు తమ పనితీరుతో ప్రజలను మెప్పించి ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తారు. దేశంలో తండ్రీకొడుకులుగా రాజకీయాలను ఏలుతున్న వారు పెరిగిపోతున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక సహా దేశమంతా వారసత్వ కుటుంబాలే వారే రాష్ట్రాలకు సీఎంలుగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటకలో కొలువుదీరే ఏ ప్రభుత్వంలోనైనా సీఎం పదవి శాశ్వతం కాదన్న సంగతిని అందరూ గుర్తుంచుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ సీఎం కూడా […]

Written By: NARESH, Updated On : July 28, 2021 4:17 pm
Follow us on

నాన్న రాజకీయ బాట పరుస్తారు. కష్టపడి అధికారంలోకి వచ్చి కుమారులకు పూలపాన్పు పరుస్తారు. కుమారులు తమ పనితీరుతో ప్రజలను మెప్పించి ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తారు. దేశంలో తండ్రీకొడుకులుగా రాజకీయాలను ఏలుతున్న వారు పెరిగిపోతున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక సహా దేశమంతా వారసత్వ కుటుంబాలే వారే రాష్ట్రాలకు సీఎంలుగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

కర్ణాటకలో కొలువుదీరే ఏ ప్రభుత్వంలోనైనా సీఎం పదవి శాశ్వతం కాదన్న సంగతిని అందరూ గుర్తుంచుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ సీఎం కూడా ఐదేళ్లు పాలించిన పాపాన పోలేదు. తాజాగా యడ్యూరప్ప సైతం అదే దారిలో నడిచాడు. రాజీనామా చేసేశాడు.

కర్ణాటక కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ‘సీఎం పీఠమెక్కిన తండ్రీ తనయుల ద్వయం’ జాబితాలో తన తండ్రితో కలిసి ఆయన చోటు సంపాదించుకున్నాడు.

సీఎం బసవరాజు తండ్రి సోమప్ప రాయప్ప బొమ్మై కూడా 1988-89 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషం. ఇన్నేళ్లకు ఆయన కుమారుడు కూడా బీజేపీ తరుఫున సీఎం అయ్యారు.

వీరే కాదు.. చాలా రాష్ట్రాల్లో తండ్రి కొడుకులు సీఎంలుగా అయ్యారు. యూపీలో ములాయం, అఖిలేష్, కర్ణాటకలోనే దేవగౌడ-కుమారస్వామి, తమిళనాట కరుణానిధి-స్టాలిన్, ఏపీలో వైఎస్ఆర్-వైఎస్ జగన్, ఒడిషాలో బిజూ పట్నాయక్-నవీన్ పట్నాయక్, జార్ఖండ్ లో సోరేన్ ఫ్యామిలీ.. మహారాష్ట్రలో చావాన్ కుటుంబం, కశ్మీర్ లో అబ్దుల్లా తండ్రీకొడుకులు.. ఇలా దేశవ్యాప్తంగా తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ సీఎంలుగా రాణిస్తున్నవారు ఎందరో ఉన్నారు.