KCR Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హుజూరాబాద్ లో తాను ఓడించాలనుకున్న ఈటల రాజేందర్ గెలిచి రావడంతో కేసీఆర్ బరస్ట్ అయ్యాడు. అసెంబ్లీలో అడుగుపెట్టనీయవద్దని ఆయన పట్టిన పంతం నెరవేరలేదంటారు. అందుకే ఎప్పుడూ బీజేపీ నేతలపై పరుషంగా మాట్లాడని కేసీఆర్ బయటకొచ్చి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా నేతలను తిట్టిపోశారు. అన్ పార్లమెంటరీ భాషలో దుమ్మెత్తిపోశారు.
హుజూరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీకి కౌంటర్ గా మరోసారి తన స్ట్రాంగ్ ఇమేజ్ ను ప్రదర్శించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. తన ప్రెస్ మీట్ లో అతడు బీజేపీ నాయకులను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ప్రధానంగా టార్గెట్ చేశారు. పురుషమైన భాషలో హెచ్చరించాడు. వారు తనపై దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు.
Also Read: KCR Politics: ఫస్ట్రేషన్ కేసీఆర్.. డైవర్షన్ పాలిటిక్స్..!
సాధారణంగా తెలంగాణ ఆందోళన సమయంలో ఇటువంటి వ్యూహం కేసీఆర్ కు బాగా పనిచేసింది. ఆంధ్రాకు చెందిన ఎవరైనా కేసీఆర్ ను విమర్శించినప్పుడల్లా తన అన్ పార్లమెంటరీ డైలాగులతో కేసీఆర్ ఘాటుగా బదులిచ్చేవారు. దీనికి తెలంగాణ ప్రజానీకం, నేతలు చప్పట్లు కొట్టేవారు. కేసీఆర్ ఆంద్రోళ్లను ఉతికి ఆరేశాడని సంబరపడేవారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ భాషను తెలంగాణ ప్రజలు స్వాగతించారు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ కోసం కేసీఆర్ కొట్టాడుతున్నారు. అలాంటి భాషను ఉపయోగించడంలో తప్పు లేదని కేసీఆర్ ను హీరోగా ప్రజలు చూశారు. తమ మాండలికంలో తిడుతున్నాడని ఓన్ చేసుకున్నారు.
అయితే ఈసారి కేసీఆర్ ను తిట్టే ప్రత్యర్థులు కూడా తెలంగాణ వాసులే కావడంతో కేసీఆర్ ఫైర్ జోరు రెట్టింపు అవుతోంది. కేసీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా ‘ఆంధ్రా కార్డ్’ను విజయవంతంగా ప్లే చేసేవారు. కానీ ఇప్పుడు.. కేసీఆర్ కు అభివృద్ధి, అవినీతి మాత్రమే పారామీటర్లుగా ఉన్నాయి. అంతేకాకుండా కేసీఆర్ ఆరోపణలన్నింటిని బీజేపీ గట్టి రుజువులతో తిప్పి కొడుతోంది.
Also Read: Telangana: కేసీఆర్ పై మరో బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి
ఈ క్రమంలోనే ఇప్పటివరకూ తిరుగులేని కోటగా ఉన్న టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ గెలుపుతో భారీగా చుక్కెదురైంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితిలో కేసీఆర్ తన మాటలతో రెచ్చగొట్టేలా ఆధిక్యతను ప్రదర్శించే ఏ ప్రయత్నాలైనా ఇకపై ఓటర్లను ప్రభావితం చేయవు. ప్రత్యర్థులు తెలంగాణ వారే కావడం.. పైగా అవినీతి ఆరోపణలు లేకపోవడంతో కేసీఆర్ కు ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే ఆయన భాష అప్పుడు ప్లస్ అయ్యింది. ఇప్పుడు మైనస్ గా మారుతోంది.