Homeఎంటర్టైన్మెంట్Adhipurush: అదే స్పీడుతో టీజర్​కూడా రిలీజ్​ చేయచ్చు కదా!

Adhipurush: అదే స్పీడుతో టీజర్​కూడా రిలీజ్​ చేయచ్చు కదా!

Adhipurush: బాహుబలి సినిమాతో పాన్​ఇండియా స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్​. ఇదే జోరుతో వరుసగా పాన్​ ఇండియా తరహా సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్​తో కలిసి ఆదిపురుష్​లో నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్​ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఇటీవలే ఈ సినిమా షూటింగ్​ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓం రౌత్​ ఓ ఫొటోను సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. 103 రోజుల్లో ఆదిపురుష్​ షూట్ పూర్తయింది. ఈ అద్భుతమైన ప్రయాణం గమ్యానికి చేరుకుంది. ఎంతోమంది కష్టంతో మేము సృష్టించిన ఈ మేజిక్​ను మీతో పంచుకోవడం కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని తెలిపారు.

ప్రస్తుతం ఈ పోస్ట్​పై రెబల్​ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ టైంలో షూటింగ్​ పూర్తి చేశారని.. అదే స్పీడ్​లో ప్రభాస్​ ఫస్ట్లుక్​ కూడా విడుదల చేయండంటూ.. ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

భారీ బడ్జెట్​, 3డీ సినిమాగా రానున్న ఆదిపురుష్​లో సీత పాత్రలో కృతి సనన్​ కనిపించనుంది. రావణాసురుడిగా బాలీవుడ్​ హీరో సైఫ్​ అలీఖాన్​, లక్ష్మణుడిగా సన్నీ సింగ్​ నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశముంది.

కాగా, మరోవైపు రాధేశ్యామ్ సినిమాలోనూ నటిస్తున్నారు ప్రభాస్​. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. సలార్ చిత్రంలోనూ ప్రభాస్​ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version