Homeజాతీయ వార్తలుKCR- BJP: వీడియోల విస్ఫోటనం కాదు: కేసే పలచబడిపోతుంది

KCR- BJP: వీడియోల విస్ఫోటనం కాదు: కేసే పలచబడిపోతుంది

KCR- BJP: ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే ధాటి ఉండేది. విషయ పరిజ్ఞానం కనిపించేది. కానీ ఇప్పుడు వాటి స్థానంలో భయం, ఆందోళన ప్రస్ఫుటమవుతున్నాయి. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ విషయానికి సంబంధించి మొన్న బంగారుగడ్డలో వీడియోస్ చూపిస్తాను కేసీఆర్ అన్నారు. అన్నట్టుగానే మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం ప్రగతిభవన్లో సుదీర్ఘంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక్కడ సుదీర్ఘమైన విషయాల లోతుకు పోవటం లేదు కానీ.. మొన్న ఆడియోలు.. నిన్న వీడియోలు అందులో కొత్తగా ఏది కనిపించలేదు. మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు, ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా దొరకని జవాబులు.. ఫలితంగా కేసు నానాటికి పల్చబడిపోతుంది. ఒకవేళ కేసులోనే అంత పటుత్వం ఉంటే ఏసీబీ కోర్టు జడ్జి ఆరోజే పట్టుబడ్డ ముగ్గురిని జైలుకు పంపించేవాడు. కానీ ఎటువంటి ఆధారాలు లభించని కేసును నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చారని పోలీసులపై గుడ్లురిమాడు. వందల కోట్ల డబ్బు అంటారు.. ఒక రూపాయి దొరకలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు అంటారు. మరి కొనుగోళ్లకు టచ్ లోకి వెళ్లిన వారిని కూడా విచారించాలి కదా. వాడెవడో దొంగ కోళ్లు పట్టుకునే బాపతు మధ్యవర్తులట ” ఎమ్మెల్యేలను కొంటామహో ” అని గోనె సంచుల నిండా డబ్బులు పెట్టుకొని బజారులో కూరగాయల బేరం చేస్తున్నట్టు..వచ్చారని కెసిఆర్ అన్నారు. ఆయన మాటలు ప్రకారమే అసలు దీనిని నడిపింది ఎవరు, వెనుక ఉన్నది ఎవరు? పోనీ ఆ సీన్ ఈ వీడియోలో ఎస్టాబ్లిష్ అవుతోందా? వాళ్లు ఎవరెవరి పేర్లనో ప్రస్తావిస్తే ఇక వాళ్లంతా నేరగాళ్లు అయిపోయినట్టేనా? ఈ మధ్యవర్తులతో ఈ ఆట ఆడిస్తున్నది ఎవరు? ఇవి కదా ఇప్పుడు తేలాల్సిన సందేహాలు.. సమాధానం లభించాల్సిన ప్రశ్నలు.

KCR- BJP
KCR- MODI

ఓటుకు నోటు కేసులో

2015లో ఓటుకు నోటు కేసు సమయంలో కేసీఆర్ ప్లానింగ్ కు చంద్రబాబు గింగిరాలు తిరిగి పోయాడు. దెబ్బకు హైదరాబాద్ ఖాళీ చేశాడు.. అదీ దెబ్బ అంటే. డబ్బు, వీడియోలు, సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ దొరికాయి. కానీ ఈ కేసులో ఇప్పటివరకు ఏదీ తేలలేదు. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏదీ దొరకలేదు. ఒక్కోసారి నాటి సూపర్ ప్లానర్ కేసీఆర్ నేనా మనం చూస్తున్నది అనే అనుమానం కలుగుతున్నది. పైగా ఎమ్మెల్యేలను కొనడం నిజం, దుర్మార్గం అని పదేపదే మొత్తుకుంటున్న కేసీఆర్.. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఏ విధంగా తన పార్టీలో చేర్చుకున్నది నిన్నటి ప్రెస్ మీట్ లో ఉన్న రాహుల్, దేశం యావత్తు మొత్తం చూసింది.

అంత బ్లాస్టింగ్ ఏముందని

పీటీఐ, ఏఎన్ఐ సహా మొత్తం ప్రధాన మీడియా సంస్థలకు ఈ వీడియోలను పంపిస్తున్నామని కెసిఆర్ చెప్తున్నాడు. నిజంగా ఆ వీడియోలో అంత బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే అవే వాలిపోతాయి. కానీ అవి అసలు పట్టించుకోవడం లేదు. అంటే కేసులో ఏమాత్రం పస లేదు అని అర్థం. ముఖ్యమంత్రులందరికీ, పార్టీల అధ్యక్షులందరికీ ఇస్తున్నట్టు కేసీఆర్ చెప్పాడు.. కానీ అసలు మొన్న ఆడియోల రచ్చ సమయంలో దేశంలోని ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధ్యక్షుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ వీడియోలు పంపిస్తే ఒరిగేది ఏమిటి? సదరు వీడియోల్లో అమిత్ షా పేరు 10 సార్లు వచ్చిందట! ఇంకెవరో ముఖ్యులవి పదేపదే వినిపించాయట! వాళ్లందరూ ఇక నేరస్థలేనా? అసలు ఇదేం వాదన? అదే ముఖ్యంగా ఒక వైపు మునుగోడు పోలింగ్ ముగియనే లేదు. అంతసేపట్లోనే మీడియా మీట్ పెట్టాడు కేసీఆర్. అంత ఎమర్జెన్సీ ఏముంది అందులో? పెద్ద పేలే సామాగ్రి కూడా ఏమీ లేదు కదా? ఆడియోలను మొన్న లీక్ చేశారు. కాగా వీడియోలను తనే రిలీజ్ చేస్తున్నాడు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటో ఎవరికీ తెలియదు.

KCR- BJP
KCR

 

ఏం చేసుకోవాలి వాటితో

అన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్లకు ఈ వీడియోలు పంపిస్తారట? ఏం చేసుకోవాలి వాటితో? ఒకవేళ కెసిఆర్ అనుకున్నట్టు సుమోటో కింద కేసు విచారణ చేపట్టాలి అనుకున్నా సరే వాళ్ళ అధికార పరిధి కాదు కదా! సుప్రీం చీఫ్, జస్టిస్ లకు పంపిస్తున్నారట. కానీ అంతకుముందే బిజెపి ఇక్కడ హైకోర్టును అడిగింది. సిట్టింగ్ జడ్జితో గాని, సిబిఐతో గాని విచారణ జరిపించాలని కోరింది. కానీ కెసిఆర్ ఏ సిబిఐ తెలంగాణలోకి రాకుండా జీవోలు ఇచ్చుకున్నాడు. మరి మళ్లీ సిబిఐ కి వీడియోలు పంపించడంలో ఔచిత్యం ఏముంది? రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా కేసీఆర్ ఏం సంకేతాలు ఇస్తున్నట్టు? 8 ప్రభుత్వాలను కూలగొట్టాం, మరో నాలుగు హిట్ లిస్టులో ఉన్నాయి. అందులో ఏపీ, ఢిల్లీ కూడా ఉన్నాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీ జోలికి రాకుండా చేస్తాం. అలా 100 కోట్లు ఇస్తాం. మామూలు రోజుల్లో ఇలా ఎవరైనా మాట్లాడితే బఫూన్ గాళ్లు అంటాం. సో ఏతా వాత చూస్తే ఈ వీడియోల బాగోతం ఓటుకు నోటు కేసు లాగా రక్తి కట్టడం లేదు. ఏదో మాడు వాసన కొడుతోంది. ఇంతకీ మనం చూస్తోంది ఆ పాత కేసీఆర్ నేనా?!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular