Like Share And Subscribe Review: నటీనటులు: సంతోష్ శోభన్ , ఫరియాబ్దుల్లా , బ్రహ్మాజీ, సుదర్శన్, నరేన్, మైమ్ గోపి, గోవింద్ పద్మ సూర్య, సప్తగిరి, బబ్లూ, మిర్చి కిరణ్, ఫణి
దర్శకుడు : మేర్లపాక గాంధీ
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
బ్యానర్లు : ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్
మ్యూజిక్ : ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వెంకటరత్నం
డీఓపీ : ఎ వసంత్
ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా
ఎడిటర్ : రాము తూము

యంగ్ హీరో సంతోష్ శోభన్-ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్స్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నవంబర్ 4న మూవీ విడుదలైంది. యూత్ లో సినిమాపై కొంత హైప్ ఏర్పడిన నేపథ్యంలో అంచనాలు ఎంత వరకు అందుకుంది అనేది చూద్దాం..
కథ
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ 90లలో నక్సల్ నేపథ్యంలో మొదలవుతుంది. కట్ చేస్తే సంతోష్ శోభన్ యువ వ్లాగర్, యూట్యూబర్. తన ఛానల్ కోసం ఆసక్తికర వీడియోలు చేస్తూ ఉంటాడు. దీని కోసం శోభన్ అరకు వ్యాలీకి వెళ్తారు. అక్కడకు టాప్ యూట్యూబర్స్ లో ఒకరైన ఫరియా అబ్దుల్లా కూడా వెళ్తారు. ఫరియాను చూసిన శోభన్ ఫ్లాట్ అవుతాడు. ఆమెను ప్రేమిస్తాడు. శోభన్-ఫరియా ప్రేమకథ ఏంటీ? ఈ ప్రేమికులకు నక్సల్స్ కు ఉన్న సంబంధం ఏంటీ? అనేది మిగతా కథ…
విశ్లేషణ:
విశాఖ ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ నుండి ఈ తరహా మూవీ ఊహించలేము. ఎప్పుడో రాసి పక్కన పడేసిన స్క్రిప్ట్ దులిపి, దానికి కొన్ని మెరుగులు అద్ది ఈ చిత్రం చేశారు అనిపిస్తుంది. సంతోష్ శోభన్ హిట్ మూవీ ‘ఏక్ మినీ కథ’ కు కథ అందించారు మేర్లపాక గాంధీ. దీంతో ఈ కాంబినేషన్ పై హైప్ ఏర్పడింది. ఆ అంచనాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏమాత్రం అందుకోలేకపోయింది.
సిల్లీ స్టోరీకి అంతకు మించిన వీక్ స్క్రీన్ ప్లే తోడు కావడంతో ఏ దశలో కూడా మూవీ ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఆద్యంతం నిరాశాపూరితంగా సాగుతుంది. సంతోష్ శోభన్ ప్రజెన్స్ ఆకట్టుకుంది. బ్రహ్మాజీ కామెడీ మినహాయిస్తే చెప్పుకోదగ్గ ఒక్క అంశం కూడా మూవీలో లేదు. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు అక్కడక్కడా నవ్వించే కామెడీ అలరిస్తాయి. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీల నటన మెప్పించింది. మిగతా నటులు అంతగా ప్రభావం చూపలేకపోయారు.

ప్లస్ పాయింట్స్:
లీడ్ పెయిర్ ప్రజెన్స్
కొన్ని కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
కథ
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
సినిమా చూడాలా? వద్దా?:
,పేపర్ బాయ్, ఏక్ మినీ కథ వంటి హిట్ చిత్రాలతో సంతోష్ శోభన్ యూత్ లో కొంత ఇమేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయన చిత్రాల పట్ల కొంత హైప్ ఏర్పడుతుంది. అయితే కథల ఎంపికలో తడబడుతున్న సంతోష్ శోభన్ వాళ్ళను నిరాశపరుస్తున్నారు. సిల్లీ స్టోరీ, వీక్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిరాశపరిచింది. కొన్ని కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే సినిమా బోరింగ్ గా సాగుతుంది.
రేటింగ్: 2.25/5
https://youtu.be/YqYneLBe_SU