https://oktelugu.com/

KCR : అవే రెండు పండ్లు, అదే మేడిగడ్డ.. ఇదే కరీంనగర్ లో కెసిఆర్ ప్రసంగం

కరీంనగర్ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ఊపిరిలూదిన నేపథ్యంలో.. కెసిఆర్ ఆ ప్రాంతం వేదికగానే కదన భేరి పేరుతో సభ నిర్వహించారు. సభకు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు భారీగానే వచ్చారు. నల్లగొండ ఎక్కువ జనం రావడంతో కెసిఆర్ కూడా ఉత్సాహంగా మాట్లాడారు.

Written By: , Updated On : March 12, 2024 / 08:26 PM IST
Follow us on

KCR : అవే పండ్లు.. అవే బ్యారేజీలు.. అదే మేడిగడ్డ.. అదే కేసీఆర్.. నల్లగొండలో ఏం చెప్పాడో.. కరీంనగర్ లోనూ అవే మాటలన్నాడు. కాకపోతే ఈసారి బీఆర్ఎస్ తెలంగాణ గళం, తెలంగాణ దళం.. తెలంగాణ బలం.. అని ప్రాసతో కూడిన మాటలు మాట్లాడాడు. రేవంత్ పై అవే విమర్శలు, కాంగ్రెస్ పార్టీపై అదే తిట్ల పురాణం.. మొత్తానికి వరుసపెట్టి నాయకులు వెళ్లిపోతున్న తరుణంలో.. కీలకమైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్న సమయంలో.. కెసిఆర్ ఒకింత ఆగ్రహంతో మాట్లాడారు. కోపం కట్టలు తెచ్చుకున్నప్పటికీ.. కొంతవరకు దానిని సముదాయించారు. మొత్తానికి కరీంనగర్ కదన భేరి సభలో మేడిగడ్డ ఎందుకు కుంగిందో చెప్పలేదు గాని.. దాని రిపేర్ మాత్రం కాంగ్రెస్ బాధ్యత అని రేవంత్ బాధ్యత గుర్తు చేశాడు.

“మన నోట్లో 32 పండ్లు ఉంటయ్.. రెండు పండ్లు ఊగులాడితే.. అన్ని పండ్లను ఊడగొట్టుకుంటమ.. ఆ రెండు పండ్లను బాగు చేసుకుంటం గని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను వాళ్లకు ఒకటే చెప్పిన.. మూడు నెలలపాటు వాళ్లను ఏమనకుర్రి.. ఆ తర్వాత కార్యాచరణ మొదలుపెడదాం అని చెప్పిన. ఆ మూడు నెలలు కూడా వాళ్లు సక్కగ పని చేయలె. రెండు లక్షల రుణం ఇస్తామన్నరు, ఇంకేదో చెప్పిర్రు. కానీ ఉత్తి డబ్బా.. అందుకే మేము యుద్ధం మొదలు పెట్టినం. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు దీని గురించి చర్చ పెట్టాలె” అని కెసిఆర్ ప్రసంగించారు.

కరీంనగర్ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ఊపిరిలూదిన నేపథ్యంలో.. కెసిఆర్ ఆ ప్రాంతం వేదికగానే కదన భేరి పేరుతో సభ నిర్వహించారు. సభకు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు భారీగానే వచ్చారు. నల్లగొండ ఎక్కువ జనం రావడంతో కెసిఆర్ కూడా ఉత్సాహంగా మాట్లాడారు. అయితే గత ప్రభుత్వ లోపాలను పక్కనపెట్టి.. కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే కేసీఆర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అని సంబోధించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శలు చేశారు.. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా వినోద్ కుమార్ ను గెలిపించాలని కెసిఆర్ కోరారు.. నల్గొండ సభ మాదిరే కెసిఆర్ కుర్చీలో కూర్చునే ఇక్కడ కూడా ప్రసంగించారు. జనం భారీగానే తరలి రావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉన్నప్పటికీ.. అది పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతవరకు ఉపకరిస్తుందనేది అంతు పట్టకుండా ఉంది. మొత్తానికి ఈ సభ సూపర్ సక్సెస్ అని గులాబీ నాయకులు చెప్పుకుంటున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.