https://oktelugu.com/

గ్రేటర్ లో ‘ముందస్తు’ ఎన్నికలు?

సీఎం కేసీఆర్ వ్యూహాలు ప్రత్యర్థులకు అందని విధంగా ఉంటాయి. ఊహించని విధంగా ప్రత్యర్థులను దెబ్బకొట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుస్తుగా వెళ్లి ఘన విజయం సాధించారు. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా ఐదారు నెలల సమయం ఉండగానే కేసీఆర్ ముందుస్తు ఎన్నికల వెళ్లి అందరికీ షాకిచ్చారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం తెరుకునే ఛాన్స్ ఇవ్వకుండా కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 29, 2020 4:47 pm
    Follow us on


    సీఎం కేసీఆర్ వ్యూహాలు ప్రత్యర్థులకు అందని విధంగా ఉంటాయి. ఊహించని విధంగా ప్రత్యర్థులను దెబ్బకొట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుస్తుగా వెళ్లి ఘన విజయం సాధించారు. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా ఐదారు నెలల సమయం ఉండగానే కేసీఆర్ ముందుస్తు ఎన్నికల వెళ్లి అందరికీ షాకిచ్చారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం తెరుకునే ఛాన్స్ ఇవ్వకుండా కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.

    Also Read: అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?

    ఐదునెలల పాలనపోతే పోయింది గానీ టీఆర్ఎస్ సర్కారుకు మరో ఐదేళ్ల పదవీ కాలం లభించింది. ఇదంతా కేసీఆర్ చాణిక్యం వల్లే సాధ్యమైంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ ఎన్నికలకు వెళితే పరిస్థితి వేరేలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ ముందుచూపు కారణంగానే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించిందనే టాక్ టీఆర్ఎస్ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీకి రానున్న గ్రేటర్ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని భావిస్తున్నాయి. అయితే కేసీఆరే ఆ పార్టీలకు గట్టి షాకిచ్చేందుకు రెడీ అవుతున్నారనే టాక్ విన్పిస్తోంది.

    వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పర్యటనలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేస్తున్నారు. ప్రజలు కోరిందే తడువుగా పనులు చేసిపెడుతూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ గ్రేటర్లో ఓ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ టీఆర్ఎస్ బలహీనంగా ఉంది.. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకు ఉన్న పలుకుబడి.. ప్రజాదరణ వంటి అంశాలతో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అభిప్రాయం సేకరించినట్లు సమాచారం. ఈమేరకు మార్పులు చేర్పులు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

    Also Read: టీఆర్ఎస్ వేటకు కాంగ్రెస్ కుదేలు

    గతంలో గ్రేటర్లో వంద సీట్లను గెలుస్తామని ప్రకటించగా 99సీట్లు సాధించింది. ఈసారి కూడా వంద సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో వ్యతిరేకత ఉండటంతో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది. గ్రేటర్లో ఇప్పటికే భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. నాలుగైదు నెలల్లో అన్ని పనులు పూర్తి చేసేలా సన్నహాలు చేస్తోంది. దీంతో డిసెంబరు నెలలోనే ఎన్నికల వెళితే ఏమేరకు తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసుకుంటోంది.

    కాంగ్రెస్, బీజేపీలు ఇంకా ప్రచార బరిలో దిగలేదు. దీంతో వీలైనంత త్వరగానే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ముందస్తు ఎన్నికలను వెళ్లాలని భావిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొచ్చినా ముందస్తు గెలుపు మంత్రం.. గ్రేటర్లో ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..!