టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నిత్య యవ్వనుడు. ఫిట్‌నెస్ అంటే ప్రాణం ఇచ్చే నాగ్ అరవై దాటినా ఇంకా కుర్రాడిగానే కనిపిస్తున్నాడు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు. నాగ్ ఈ రోజు 61 పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులకు బహుబతి ఇచ్చాడు యువ సామ్రాట్. నాగ్ ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అహిశోర్ సొలోమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని అందగాడు ఎన్‌ఐఏ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. నాగ్ బర్త్‌డే ను పురస్కరించుకొని వైల్డ్ డాగ్ యూనిట్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది.
Also Read: పవన్ బర్త్‌డే స్పెషల్… ఓ సర్ప్రైజ్, ఓ సస్పెన్స్
ఏసీపీ విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్ పాత్రలోని నాగ్ లుక్‌ను రివీల్ చేసింది. ఓ ఆపరేషన్‌లో పాల్గొన్న నాగార్జున భారీ గన్ పట్టుకొని షూట్ చేయడానికి రెడీగా ఉన్న లుక్ అదిరిపోయింది. ఎన్‌ఐఏ ఏసీపీగా నాగ్ 12 మిషన్స్ పూర్తి చేశాడని పోస్టర్పై రాశారు. దాంతో, ఈ మూవీలో నాగ్ పవర్ఫుల్ పోలీసుగా కనిపించనున్నాడు. ఇక, ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రధారుల వివరాలను యూనిట్ రివీల్ చేసింది. బిగ్‌బాస్ కంటెస్టంట్ అలీ రెజా, బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తదితరులు కూడా ఎన్‌ఐఏ ఏజెంట్స్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ సరసన బాలీవుడ్ నటి దియా మిర్జా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. మిగిలిన భాగాన్ని షూట్ చేయడం కోసం నాగ్ రెడీ అయిపోయాడు. ఈ సోమవారం నుంచే తిరిగి ప్రారంభమవుతుందని ట్వీట్ చేశాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ మూవీని నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
Also Read: నాగార్జున కు బ్యూటిఫుల్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ‘లవ్ స్టోరీ’ టీమ్
మరోవైపు కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్న హిందీ యాక్షన్ ఫాంటసీ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’లో అమితాబ్ బబ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి నాగ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే, హిందీ హిట్ మూవీ ‘రైడ్’ను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు.ఇక, తన తండ్రి పుట్టిన రోజున అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. మనం లాంటి బ్లాక్ బస్టర్ అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో చైతూ హీరోగా నటిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ టైటిల్‌ను ఈ రోజు రివీల్ చేశారు. చైతూకు ఇది 20వ సినిమా కావడం విశేషం.