Site icon OkTelugu

Jagan: జగన్ బీసీ మంత్రం పనిచేస్తుందా?

Jagan

Jagan

Jagan: ఏపీ సీఎం జగన్ బీసీ మంత్రం పఠిస్తున్నారు.Jagan is giving great importance to the welfare of BCs. గత ఎన్నికలకు ముందే బీసీలను టార్గెట్ చేసుకున్న జగన్.. ఎన్నికల మాత్రం ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు. వారితోనే రెండోసారి విజయం సాధించాలని భావిస్తున్నారు. ఇందుకు తన సామాజిక వర్గాన్ని పణంగా పెడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నేతలను బుజ్జగించి పక్కన పెడుతున్నారు. వారి స్థానంలో బీసీ నేతలతో పోటీ చేయించేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నారు. ఎక్కడికక్కడే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులను ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. బీసీ పార్టీగా ముద్ర పడిన టిడిపికి ఇది కంటి మీద కునుకు లేకుండా చేసే విషయమే.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత.. ఉమ్మడి ఏపీలో బీసీ నాయకులు పుట్టుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే బీసీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ టిడిపిగా అభివర్ణించవచ్చు. 2019 ఎన్నికల వరకు బీసీలు తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారులు. కానీ జగన్ తన సంక్షేమ తారక మంత్రంతో బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యారు.వారిఓట్లను చీల్చగలిగారు.మెజారిటీ వర్గం అభిమానాన్ని చురగొన్నారు. ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం అప్పగిస్తానంటూ చెప్పుకొస్తున్నారు. ఓసి నియోజకవర్గాల్లో సైతం బీసీలను రంగంలోకి దించి ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారు. దీంతో టీడీపీ డిఫెన్స్ లో పడిపోయింది.

ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీసీ ఫార్ములాను తెరపైకి తెచ్చింది. సామాజిక సాధికారత తమ అభిమతంగా చెప్పుకొచ్చింది. పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే అది పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ బీసీలను మాత్రం ఆ పార్టీ ఆకట్టుకోగలిగింది. 2029 నాటికి ఇదే బీసీ నినాదంతో బిజెపి ముందుకెళితే తెలంగాణలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అయితే దీనిని గ్రహించిన జగన్ బిసి సాధికారిక అంశాన్ని తెరపైకి తెచ్చి వెనుకబడిన వర్గాల నాయకులకు రాజకీయ ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. అవకాశం ఉన్నచోట బీసీలకు టిక్కెట్లు ఇచ్చి.. వారి ఆమోదంతోనే రెండోసారి ఏపీలో గెలవాలని చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version